Quad will establish peace and prosperity in the world: ప్రపంచ శాంతి కోసం క్వాడ్‌ కూటమి కృషి చేస్తోందని ప్రధాని మోదీ  (PM Modi) పేర్కొన్నారు. అంతర్జాతీయ శ్రేయస్సుకు అది తోడ్పడుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, (Baiden) ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ (Scott Morrison), జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగాలతో కలిసి శ్వేతసౌధంలో క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. కొవిడ్‌, పర్యావరణమార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమావేశంలో మోదీ మాట్లాడుతూ క్వాడ్‌లో అందించుకుంటున్న పరస్పర సహకారం ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు, అంతర్జాతీయ సౌభాగ్యానికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాని తెలిపారు. ప్రపంచ శ్రేయస్సు కోసం పని చేసే శక్తి క్వాడ్‌ (Quad) కూటమి అని పేర్కొన్నారు. క్వాడ్‌ రూపొందించిన టీకా కార్యక్రమం ఇండో-పసిఫిక్‌ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.


Also Read : Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా


2004లో జపాన్‌లో సునామీ విధ్వంసం సృష్టించినప్పుడు తామంతా కలిసికట్టుగా పనిచేశామని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కరోనా విపత్తు వేళ మానవత్వ పరిరక్షణకు క్వాడ్‌ (Quad) రూపంలో ఒక్కటిగా కృషి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ భద్రత, పర్యావరణ మార్పులు, కొవిడ్‌ వంటి అంశాల్లో సభ్య దేశాలతో కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ (Modi) పేర్కొన్నారు. బైడెన్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌, పర్యావరణ మార్పుల వంటి ఉమ్మడి సవాళ్లను అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు.


Also Read : Private Versity Act: ప్రైవేటు వర్శిటీ చట్ట సవరణ, పేదలకు ఇకపై 35 శాతం సీట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి