Private Versity Act: విద్యారంగంలో కొత్తమార్పులు తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో సైతం 35 శాతం సీట్లు పేద విద్యార్దులకు అందనున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలు చేసింది.
ఏపీ ప్రభుత్వం(Ap government) విద్యారంగంలో ఇప్పటికే కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమైన సంస్కరణలతో దేశంలో ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త మార్పు తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్శిటీల్లోని వివిధ కోర్సుల్లో 35 శాతం సీట్లు నిరుపేద మెరిట్ విద్యార్ధులకు కేటాయించనుంది. ప్రభుత్వ కోటాలో భాగంగా రాయితీ ఫీజులతో ఈ సీట్లు పేద విద్యార్ధులకు దక్కనున్నాయి. దీనికి సంబంధించి ప్రైవేటు యూనివర్శిటీల చట్టం 2017కు సవరణలు చేసింది(Amendments in Private Universities Act). వివిధ సంస్థల విధి విధానాల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ప్రభుత్వ, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ కళాశాలలతో పాటు ప్రైవేటు వర్శిటీల్లో కూడా పేదలకు సీట్లు దక్కనున్నాయి.
గతంలో ఉన్న ప్రైవేటు వర్శీల చట్టంలో వర్శిటీలకు లాభం చేకూరేలా నిబంధనలున్నాయి. ప్రైవేటు వర్శిటీలకు భూముల్ని తక్కువ ధరకు అందించడమే కాకుండా రాయితీలు కూడా కల్పించారు. ఫీజులు, అడ్మిషన్ల వ్యవహారాల్లో కూడా వర్శిటీలదే పూర్తి అధికారముండేది. దాంతో పేద మెరిట్ విద్యార్ధులకు ఆ వర్శిటీల్లో అడ్మిషన్ సాధ్యమయ్యేది కాదు. ఈ నేపధ్యంలో ప్రైవేటు వర్శిటీల్లో 35 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన రాష్ట్ర విద్యార్ధులకు రిజర్వేషన్ ప్రకారం కన్వీనర్ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం ఫీజులపై కూడా నియంత్రణ ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రెగ్యులేటరీ అథారిటీ(Regulatory Authority) ప్రైవేటు వర్శిటీలు ఫీజుల నిర్ణయానికి సంబంధించిన అక్కౌంట్ పుస్తకాల్ని రెగ్యులేటరీ అథారిటీకు సమర్పించాలి. వర్శిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనేది అథారిటీ పరిశీలిస్తుంది. అంతిమ ఫీజుల్ని నిర్ణయిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యాసంస్థలపై 15 లక్షలకు మించకుండా పెనాల్టీ విధించే అధికారం అథారిటీకు ఉంటుంది. ప్రైవేటు వర్శిటీలు ప్రభుత్వ సూచనల ప్రకారం నిర్ణీత ప్రమాణాల్లో నాక్(NAAC), ఎన్‌బీఏ గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్‌లో మూడేళ్ల కోర్సుల నిర్వహణకు 250 కోట్ల పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయంగా టాప్ 100 యూనివర్శిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీల కోసం టైఅప్ కలిగి ఉండాలి.
Also read: AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, అతి భారీ వర్షాల హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి