New borns body thrown on road in kochi: కేరళలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఒక యువతి తనకు పుట్టిన శిశువును కవర్ లో చుట్టేసి అపార్ట్ మెంట్ పై నుంచి రోడ్డుమీద పడేసింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఆకవర్ తెరిచి చూడటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే వారంతా స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాధారణంగా అమ్మను దేవుడిలాగా కొలుస్తారు. తొమ్మిది మాసాలు తమ బిడ్డలను కడుపులో పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతుంది. అంతేకాకుండా.. తన బిడ్డకు ఏదైన జరిగితే విలవిల్లాడిపోతుంది. చాలా మంది మహిళలు పెళ్లాయ్యాక.. తల్లికావాలని కలలు కంటుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..


కొందరిలో అనారోగ్య సమస్యల వల్ల తల్లికాలేకపొతుంటారు. దీని కోసం కొందరు ఆస్పత్రుల చుట్టు, దేవాలయాల చుట్టు తిగుతుంటారు. డబ్బులు ఎంతైన ఖర్చులు చేయడానికి వెనుకాడరు. ఒక వేళ ఏదైన సమస్యలతో తల్లికాలేరని డాక్టర్లు చెబితే, అనాథాశ్రమం లేదా తెలిసిన వారి నుంచి బిడ్డలను దత్తత తీసుకుని మరీ పెంచుకుంటారు. అమ్మా.. అని పిలిపించుకోవడానికి పరితపిస్తుంటారు.


కానీ మరికొందరు తల్లులు ఆ అమ్మతనానికి మచ్చను తెచ్చేలా పనులు చేస్తుంటారు.  కొందరు యువతులు యుక్తవయస్సులో ఇతరులతో శారీరక సంబంధాలుకొనసాగిస్తారు. ఈ  క్రమంలో గర్భందాల్చడంతో పాటు, అబార్షన్లు కూడా చేసుకుంటుంటారు. మరికొందరు గర్బందాల్చిన తర్వాత డెలీవరీ వరకు చూసి,ఆ తర్వాత శిశువులు పుట్టాక, చెత్తకుప్పలో పాడేస్తుంటారు. కొందరు శిశువులను పురిట్లోనే చంపేయడానికి సైతం వెనుకాడరు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


కేరళలోని కొచ్చిలో దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక ఎంబీఏ స్టూడెంట్ గర్బందాల్చింది. ఈ క్రమంలో ఆమె తన బాత్రూమ్ లో డెలీవీరి అయ్యింది. అంతేకాకుండా.. ఆ పుట్టిన శిశువు మరీ తనకు ఇష్టంలేదో.. మరేంటో కానీ ఆ శిశువును ఒకప్లాస్టిక్ కవర్ లో వేసింది. ఆ తర్వాత ఐదంతస్థుల బాల్కనీ నుంచి రోడ్డుమీద పడేసింది. అక్కడ విధుల్లో ఉన్న మున్సిపాలిటి సిబ్బంది రోడ్లను శుభ్రంచేస్తున్నారు.


Read more: Asaduddin Owaisi: మాధవీ లత ఎఫెక్ట్..?.. పండితుల ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్ ఓవైసీ..వీడియో వైరల్..


ఆ ప్లాస్టిక్ కవర్ ను తెరిచి చూడగా అందులో నవజాత శిశువు శవం కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కవర్.. ఒక అంతస్థు బాల్కనీ నుంచి యువతి రోడ్డుమీద పడేసినట్లు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన  స్థానికంగా దిగ్భ్రాంతిని గురిచేసేదిగా మారింది. ఘటనపై విచారణ జరిపి, నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter