Rajyasabha: కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాక్ నఖ్వికు మరో పదవి లభించింది. బీజేపీ కేంద్ర మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం వ్యక్తికి ప్రధాని మోదీ అదనంగా మరో బాధ్యత అప్పగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం వ్యక్తి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి(Mukhtar Abbas Naqvi). ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) అదనంగా మరో బాధ్యత అప్పగించారు. కేంద్రమంత్రిగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్విని రాజ్యసభ ఉప నాయకుడిగా నియమించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు నఖ్విని ఉప నాయకుడిగా నియమించినట్టు సభా నాయకుడు పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభ (Rajyasabha)లో బీజేపీకు సరైన సంఖ్యాబలం లేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ సమస్యల్ని పరిష్కరించేందుకు పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి(Mukhtar Abbas Naqvi)లు కీలకపాత్ర పోషించనున్నారు. నరేంద్ర మోదీ మొదటి సారి ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి..వాజ్‌పేయి హయాంలో కూడా మంత్రిగా పని చేశారు. 


Also read: JEE Mains Exam 2021: వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook