Omicron: భారత్‌లో నాలుగో ఒమిక్రాన్ కేసు..ముంబైలో గుర్తింపు..
Omicron: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం గుజరాత్, మహారాష్ట్రల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు(Omicron Case) బయటపడింది. ముంబయి(Mumbai)కి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. అతడు గత నెల 24న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, దిల్లీ మీదుగా ముంబయి చేరుకున్నాడు. అతడికి కొవిడ్ పరీక్ష చేయగా.. శనివారం ఒమిక్రాన్ పాజిటివ్(Omicron Positive)గా తేలింది. తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
Also Read: Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు-గుజరాత్‌లో గుర్తింపు-మూడుకి చేరిన కేసుల సంఖ్య
ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కేంద్రం వెల్లడించగా.. శనివారం గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌతాఫ్రికా(South Africa)లో బయటపడ్డ ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు 38 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.ఈ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook