Woman Orders Wine Online : ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా రూ.4.80 లక్షలు పోగొట్టుకుంది. తన ఫోన్‌కి వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో ఆమె మోసపోయింది. నిజానికి మొదట్లోనే ఆమె మోసాన్ని గ్రహించి ఉంటే అంత భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకునేది కాదు. ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మి క్యూఆర్ కోడ్ పంపిన ప్రతీసారి స్కాన్ చేయడంతో ఆమె ఖాతా ఖాళీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని పోవాయ్‌కి చెందిన ఆ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఇటీవల ఆమె సోదరి తన ఇంటికి రావడంతో ఆమె పార్టీ ఇవ్వాలనుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వైన్ ఆర్డర్ చేయాలనుకుంది. వెంటనే సెల్‌ఫోన్‌లో గూగుల్ సెర్చింజన్ ఓపెన్ చేసి తమ ఇంటికి దగ్గరలో ఉన్న వైన్ షాప్స్ గురించి సెర్చ్ చేసింది. మొబైల్ స్క్రీన్‌పై కొన్ని షాపుల పేర్లు కనిపించగా... అందులో 'ఓం సాయి బీర్ షాప్' అనే సెర్చ్ రిజల్ట్‌పై క్లిక్ చేసింది.


ఆ వెంటనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఓం సాయి బీర్ షాప్ నుంచి మాట్లాడుతున్నానని సదరు వ్యక్తి ఆమెతో చెప్పాడు. తమ వద్ద క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ లేదని... ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాలని తెలిపాడు. దీంతో డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా ఆమె అతనికి రూ.650 చెల్లించింది. ఆ వెంటనే మళ్లీ ఫోన్ చేసిన ఆ వ్యక్తి... నిజానికి ఆ వైన్ ఖరీదు రూ.620 మాత్రమేనని, రూ.30 అదనంగా చెల్లించారని చెప్పాడు.


మీ రూ.30 మీకు రిటర్న్ రావాలంటే ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తా.. దాన్ని స్కాన్ చేయాలని ఆమెను నమ్మించాడు. దీంతో అతను క్యూఆర్ కోడ్ పంపించగానే ఆమె స్కాన్ చేసింది. అంతే.. ఆమె ఖాతా నుంచి రూ. 19,991 మైనస్ అయ్యాయి. షాక్ తిన్న ఆ మహిళ ఇదేంటని ఆరా తీయగా.. మరో క్యూఆర్ పంపిస్తానని ఈసారి అలా జరగదని అతను చెప్పాడు. మళ్లీ అతను క్యూఆర్ కోడ్ పంపించడం.. ఆమె స్కాన్ చేయడం జరిగిపోయాయి. అలా ఈసారి రూ.96,108 ఆమె ఖాతా నుంచి అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. 


ఇదే తంతు మరో రెండు, మూడుసార్లు జరగడంతో ఆమె ఖాతా నుంచి మొత్తం రూ.4.80 లక్షలు ఖాళీ అయ్యాయి. దీంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపేవారు ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


Also Read: Hrithik Roshan-Sussanne Khan: హవ్వ.. ఇదెక్కడి లవ్ స్టోరీ.. లవర్స్‌‌తో మాజీ భార్యాభర్తలు 


CM Jagan: అంత అసూయపడితే త్వరగా టికెట్ తీసుకుంటారు.. మంచి చేస్తే శ్రీలంక, వెన్నుపోటు పొడిస్తే అమెరికానా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook