COVID-19 Cases in India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా టెన్షన్.. గత 5 నెలల్లో ఇదే అత్యధికం
New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
New Covid-19 Cases in India: ఇండియాలో మరోసారి కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 24 గంటల వ్యవధిలో 2,151 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత ఐదు నెలల కాలంలో ఇంత అత్యధిక స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. చివరిసారిగా గతేడాది అక్టోబర్ 28న దేశంలో 24 గంటల వ్యవధిలో 2,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా భారత్‌లో నిత్యం 1000 కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసులు సంఖ్య మొత్తం 11,903 కి చేరింది. పాత, కొత్త అన్నీ కలిపి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,47,09,676 కి చేరింది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనావైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 5,30,848 కి పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,66,925 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా.. ఫెటాలిటీ రేటు 1.19 శాతంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలే ముందున్నాయి. కేరళలో 2,877 కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉండగా మహారాష్ట్రలో 2,343 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో గుజరాత్ లో 1,976, కర్ణాటకలో 806, ఢిల్లీలో 671, తమిళనాడు 660, హిమాచల్ ప్రదేశ్ లో 574 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఆస్పత్రుల్లో కరోనా కేసులను ఎదుర్కునేందుకు సంసిద్ధతపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఆస్పత్రుల్లో తక్షణమే మాక్‌డ్రిల్స్ చేపట్టి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెలువడ్డాయి. ఇదే అంశంపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యవసర సమావేశం నిర్వహించి అధికార యంత్రంగానికి మార్గదర్శకాలు జారీచేశారు.
ఇది కూడా చదవండి : Chenab Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి పట్టాలెక్కిన మహింద్రా బొలెరో.. మంత్రి గారి కోసమే..
ఇది కూడా చదవండి : India Coronavirus: భయపెడుతున్న కరోనా.. గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..?
ఇది కూడా చదవండి : Coronavirus Omicron Variant: రూపం మార్చుకుంటూ పంజా విసురుతున్న కరోనా.. ఓమిక్రాన్‌లో వెయ్యికి పైగా వేరియంట్లు గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK