Corona Cases In India: దేశంలో కరోనా మహమ్మారి అలజడి మొదలైంది. రోజురోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం 1,134 కేసులు నమోదవ్వగా.. గురువారం ఆ సంఖ్య మరింత పెరిగింది. గత 24 గంటల్లో 1,300 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఉన్న రోగుల సంఖ్య 7,605కు చేరింది. గత 24 గంటల్లో 718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,41,60,997కు పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు అందించారు. గత 24 గంటల్లో 7,530 డోసులు అందించారు.
ప్రస్తుత రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.46 శాతం ఉండగా.. వారపు పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. గత 24 గంటల్లో చేసిన 89,078 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.06 కోట్ల పరీక్షలు చేశారు. మంగళవారం 699, బుధవారం 1,134, నేడు 1,300 కరోనా కేసులు నమోదవ్వడం భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతోంది. ఓమిక్రాన్‌లో వెయ్యికి పైగా వేరియంట్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. BA.1, BA.2, BA.5, BQ.1, BA.4, BA 2.12.1 XBB, BA 2.75 వంటి సబ్ వేరియంట్లన్నీ ఓమిక్రాన్ రూపాంతరాలు. XBB1.5, XBB 1.16 అనేవి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (VOI)పై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. ఈ వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నా.. ప్రాణాంతకం కాదని వారు చెబుతున్నారు.
జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో ఇతర అన్ని వేరియంట్‌ల కేసులు తగ్గుతున్నాయి. కానీ కరోనా XBB.1.16 వేరియంట్ కేసులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. జనవరిలో ఈ వేరియంట్‌కు సంబంధించి 2 కేసులు నమోదు కాగా.. మార్చిలో 204 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల్లో మొత్తం 344 కేసులు ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులే నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలో ఈ వేరియంట్ వ్యాపించింది.
అదేవిధంగా XBB.1.5 కేసులు కూడా మూడు నెలల్లో 196కి పెరిగాయి. జనవరిలో 46 కేసులు నమోదైతే.. ఫిబ్రవరిలో 103, మార్చిలో 47 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 966 కేసులు నమోదవుతుండగా.. ప్రపంచ స్థాయిలో రోజుకు దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటకలలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆ తరువాత తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?
Also Read: Ind Vs Aus: నీ యవ్వ తగ్గేదేలే.. డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్‌లో సంబురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి