Driving License Rules: డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు, కొత్త నిబంధనలు జారీ
Driving License Rules: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. లైసెన్స్ కోసం ఇంతకుముందులా ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇప్పుడు లైసెన్స్ పొందడం చాలా సులభమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Driving License Rules: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం చాలా సులభతరం చేసేసింది. కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. గతంలో ఉన్నట్టు ఆర్టీవో కార్యాలయాలు లేదా ఏజెంట్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేసింది. వాస్తవానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చి చాలాకాలమే అయినా అందరికీ ఇంకా తెలియాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ పొందడాన్ని చాలా సులభతరం చేసేసింది. డ్రైవింగ్ టెస్ట్ లేదా మరే ఇతర పరీక్షకైనా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం చూసేవారికి చాలా రిలీఫ్ కలగనుంది. కొత్త మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేందుకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ద్వారా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికెంట్స్ నిర్ణీత పరీక్షలు ఉత్తీర్ణులేతే సంబంధిత డ్రైవింగ్ స్కూల్ నుంచి ఓ సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కోసం డ్రైవింగ్ స్కూల్స్ కనీసం ఒక ఎకరం స్థలం కలిగి ఉండాలి. అదే మీడియం, హెవీ వాహనాల డ్రైవింగ్ శిక్షణకు 2 ఎకరాల స్థలం అవసరమౌతుంది. శిక్షణ ఇచ్చేవాళ్లు కనసీం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండి ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని, 5 ఏళ్లు డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. లైట్ మోటార్ వాహనాలకైతే గరిష్టంగా 4 గంటల 29 నిమిషాల డ్రైవింగ్ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
రోడ్స్,రూరల్ రోడ్లు, హైవేలు, నగర రోడ్లు, పార్కింగ్, రివర్స్ , ఘాట్ ఎత్తు పల్లాల్లో డ్రైవింగ్ వంటివాటిపై 21 గంటల శిక్షణ కలిగి ఉండాలి. ట్రాఫిక్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎలాంటి విషయాలు పరిగణలో తీసుకోవాలి, ట్రాఫిక్ సంబంధిత విషయాలు, ప్రమాదాలకు కారణాలు, ఫస్ట్ ఎయిడ్, పెట్రోల్-డీజిల్ వాహనాల డ్రైవింగ్ తేడాలను అర్దం చేసుకోగలగాలి. ఈ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు తెలుసుకుంటే లైసెన్స్ పొందడం చాలా సులభం. ఇంతకుముందులా ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook