Night Curfew Order Withdrawn in Karnataka: బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించడంపై యూట‌ర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాల‌ను జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను గురువారం ఉప‌సంహ‌రించుకుంటున్నట్లు ప్రకటించింది. ప‌రిస్థితిని స‌మీక్షించిన త‌ర్వాత టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ సూచ‌నల అనంతరం కేబినేట్ మంత్రులతో చర్చించి రాత్రి పూట క‌ర్ఫ్యూ ఆదేశాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం (Karnataka CMO) ప్ర‌క‌టించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిన్న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్ర‌తి రోజూ రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంటల వ‌ర‌కూ క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని కర్ణాటక ప్ర‌భుత్వం (Karnataka) పేర్కొన్న‌ది. అయితే దానిని అమ‌లు చేయ‌డానికి కొన్ని గంటల ముందే ఆ ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.  Also Read: Karnataka: హనుమాన్ ఆలయానికి ముస్లిం భూమి విరాళం


అయితే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సీఎంవో సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని.. మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచనలు చేసింది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించవచ్చని పేర్కొంది. Also read: Vakeel Saab shooting: ఆదివాసీలతో జనసేనానీ.. పవన్ కల్యాణ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook