నివర్ తుపాను దూసుకొస్తోంది. తమిళనాట తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆగ్నేయ బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారి..నవంబర్ 25న తీరం దాటనుందని వాతావరణ శాఖ ( IMD ) స్పష్టం చేసింది. ప్రస్తుతం నివర్ తుపాను ( Nivar Cyclone ) పుదుచ్చేరికి  తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.  ఈ నివర్ తుపాను నవంబర్ 25వ తేదీ సాయంత్రం మమాళ్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే  ( Landfall time ) సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.


నివర్ తుపాను ( Nivar Cyclone ) ప్రభావం తమిళనాడు ( Tamilnadu ), పుదుచ్చేరి ( Puducheri ) రాష్ట్రాలపై భారీగా ఉండనుంది. అటు ఏపీ ( AP ) లోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో  అతి భారీ వర్షాలు పడనున్నాయని..వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో సైతం నివర్ తుపాను కారణంగా మోస్తరు వర్షాలు పడవచ్చు. నివర్ తుపాను నేపధ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గాబా సమీక్ష నిర్వహించారు. విద్యుత్, వైద్య, రెవిన్యూ, పౌర సరఫరాల శాఖలు అప్రమత్తంగా ఉండి ఆస్థినష్టం, ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభావిత రాష్ట్రాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.  తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మొహరిస్తున్నారు.


Also read: AP: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, భారీ వర్షాలు