AP: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో తుపానుగా బలపడనుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.

Last Updated : Nov 23, 2020, 03:27 PM IST
  • తుపానుగా బలపడనున్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం
  • రానున్న 3 రోజులపాటు కోస్తాంధ్ర, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • తీరం వెంబడి 45-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
AP: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, భారీ వర్షాలు

బంగాళాఖాతం ( Bay of Bengal )లో తుపాను హెచ్చరిక జారీ అయింది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో తుపానుగా బలపడనుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను ( Cyclone Alert ) ఏర్పడనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. భారత వాాతావరణ శాఖ ( IMD ) సూచనల ప్రకారం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం  ( Bay of Bengal ) లో కొనసాగుతున్న వాయుగుండం తుపానుగా బలపడనుంది. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు ( Heavy rains alert ) పడనున్నాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. 

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. సముద్ర తీరం వెంబటి 45-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని..మూడ్రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరిస్తోంది. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు తెలిపారు. Also read: AP: మహిళలు, చిన్నారుల రక్షణకై అభయం ప్రాజెక్టు ప్రారంభం

Trending News