Hema Chaudhary Murder Case: సినిమాలు చూసి జనాలు ఇలా తయారవుతున్నారో లేక జనాన్ని చూసి సినిమా దర్శక నిర్మాతలు అలా తెరకెక్కిస్తున్నారో తెలియదు కానీ రోజురోజుకు క్రైమ్ వార్తలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజాగా గ్రేటర్ నోయిడా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన పాయల్ భాటి తన ప్రేమికుడితో కలిసి తనలాగే కనిపించే హేమా చౌదరి అనే యువతిని ఇంటికి పిలిపించి హత్య చేసింది. ఆమెను చంపిన అనంతరం హేమ ముఖంపై వేడి నూనె పోసి ఆమె గుర్తింపు తొలగించేందుకు ప్రయత్నించింది. తానే చనిపోయినట్టు పాయల్ నమ్మించాలని భావించింది, అందుకే ఆమె డెడ్ బాడీ దగ్గర పాయల్ పేరుతో సూసైడ్ నోట్ కూడా పెట్టి పరారయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సూసైడ్ నోట్ చదివిన తర్వాత బంధువులందరూ ఆమె పాయల్ అని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తర్వాత సదరు హేమా చౌదరి సోదరుడు తన సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్ రికార్డులు తీస్తే అందులో పాయల్ ప్రేమికుడితో హేమా చౌదరి చివరిగా మాట్లాడినట్టు గుర్తించారు. నిజానికి పాయల్ తన ప్రేమికుడితో కలిసి తన సోదరుడి భార్య, బావ అలాగే తన తల్లిదండ్రులను బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన పెళ్లిళ్ల బ్రోకర్ ను హత్య చేయాలని ప్లాన్ చేసింది. అందుకే ముందుగా తానే చనిపోయినట్టు నాటకం ఆడి వాళ్లను చంపాలని భావించింది.


అయితే హేమ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులు గురువారం నాడు పాయల్ ఆమె ప్రేమికుడు అజయ్ లను అరెస్టు చేశారు. నిజానికి, పాయల్ ఫేస్‌బుక్ స్నేహితుడు అజయ్‌తో కలిసి హేమా చౌదరిని హత్య చేసిందని తేలింది. నవంబర్ 12న దాద్రీలో నేరం చేసి పరారీలో ఉన్న ఏడు రోజుల తర్వాత పాయల్ ఆర్యసమాజ్ ఆలయంలో అజయ్‌ను వివాహం చేసుకుంది. ఇక అనంతరం తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.


అయితే ఆమె నేరం చేయకముందే పోలీసులు అజయ్, పాయల్‌లను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర భాటి, రాకేష్ దేవి దంపతులకు పాయల్ ఏకైక కుమార్తె అని బద్‌పురా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై చనిపోవడానికి ప్రయత్నించింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఫేస్‌బుక్‌లో అజయ్‌కు పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారితీసింది. తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని అజయ్‌తో ప్లాన్ చేశాడు. ప్రజల దృష్టి నుండి తప్పించుకోవడానికి, ఆమె తన మరణాన్ని తానే నకిలీ చేసుకున్నాడు.
Also Read: Ali Daughter Marraige : పవన్ కళ్యాణ్ అందుకే పెళ్లికి రాలేదు.. నోరు విప్పిన కమెడియన్ అలీ


Also Read: Shraddha Murder Case Update: నార్కో టెస్టులో అఫ్తాబ్ బయటపెట్టిన నిజాలు ఇవే.. ఆ విషయం చెప్పేశాడు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook