Ali Daughter Pawan Kalyan : అలీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం నుంచి కూడా అలీ వెంటే ఉన్నాడు. తొలిప్రేమ నుంచి మొన్న వచ్చిన చిత్రాల వరకు అలీ ఉంటూనే ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి చివరగా నటించింది కాటమ రాయుడు చిత్రమే. ఇక పొలిటికల్‌గా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరినొకరు మాటలు అనుకోవడంతో ఆ దూరం మరింత దూరంగా జరిగింది.
చివరకు అలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ వెళ్లన్నంతగా మారిందని టాక్ వినిపించింది. అలీయే వెడ్డింగ్ కార్డ్ ఇవ్వలేదని, పిలవలేదని కొందరు అన్నారు. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినా కూడా పెళ్లికి రాలేదని ఇంకొందరు అన్నారు. అయితే అలీ కూతురు ఫాతిమా పెళ్లిలో చిరంజీవి దంపతులు మెరిశారు. నాగార్జున తన భార్య అమలతో సందడి చేశాడు. మంత్రి రోజా సైతం వచ్చింది. ఇక సీఎం జగన్ కోసమే అన్నట్టుగా స్పెషల్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.
నీలి నిబ్బాల కోసం ఈ వీడియో 😀😀@PawanKalyan @ysjagan pic.twitter.com/bkjt5YObV3
— Prasannakumar Nalle (@PrasannaNalle) December 1, 2022
ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడంటూ జనాలు ఎదురుచూశారు. కానీ పెళ్లికి, రిసెప్షన్‌కి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య దూరం ఇంకా దూరంగానే ఉన్నట్టుగా అర్థమైంది. తాజాగా అలీ ఈ విషయం మీద స్పందించాడు. పవన్ కళ్యాణ్‌కు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చానని, వస్తానని కూడా అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవ్వడంతో పెళ్లికి హాజరు కాలేకపోయాడట. ఎప్పుడైనా కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటే చెప్పు.. అప్పుడు వస్తాను అని అన్నాడట. అందుకే పెళ్లికి రాలేకపోయాడట పవన్ కళ్యాణ్. అలీ ఇచ్చిన ఈ క్లారిటీతో వీరి స్నేహ బంధం మరోసారి ఎంత గట్టిదో అందరికీ తెలిసి వచ్చింది.
Also Read : HIT 2 Movie Review : హిట్ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?
Also Read : Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook