PNB Recruitment 2024 Apply Online: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 2024 ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోగలరు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుంమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1025 స్పెషలిస్ట్ బ్యాంకుల భర్తీకి లక్ష్యంగా ఈ దరఖాస్తులు స్వీకరణ చేస్తోంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దరఖాస్తు కు కావాల్సిన అర్హత, పరీక్ష ఫీజు వివరాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం ఖాళీలు: 1,025.


1. ఆఫీసర్ స్కేల్-I: 1000 


2. మేనేజర్ స్కేల్-II: 15 


3.సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ స్కేల్-III: 5


4. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ స్కేల్-II: 5 పోస్టులు


ఇదీ చదవండి: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..


విద్యార్హత..


బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పరీక్ష రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతావారికి రూ.1180.
అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే 2024 జనవరి 1 నాటికి 28 ఏళ్లు దాటకూడదు. మేనేజర్, సీనియర్ మేనేజర్‌ పోస్టులకు వరుసగా 35, 38 నిండకూడుదు. 


ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి..?


పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక పోర్టల్ pnbindia.in దరఖాస్తు చేసుకోవాలి.
అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ ఎంపిక చేసుకోవాలి


ఇదీ చదవండి: Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..


ఆ తర్వాత 'RECRUITMENT FOR 1025 POSTS OF SPECIALIST OFFICERS UNDER HRP 2024-25' ఆప్షన్ క్లిక్ చేయాలి.


అందులో మీ వివరాలను నమోదు చేసుకోవాలి. అవసరమైన డాక్యుంమెంట్స్‌ను అప్లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.


చివరగా ఫారమ్ సబ్మిట్ చేసి, కన్ఫర్మెషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.


ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పేజీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి