సైకిల్‌పై 3000 కి.మీ.. హైదరాబాద్‌లో టైర్ పంక్చర్.. కార్మికుడి కష్టాలు
మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
జాజ్‌పూర్ (ఒడిశా): కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది దినసరి కార్మికులు, వలస కూలీలు. ఒక్కసారిగా తమ పనులు ఆగిపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారాన్ని అందిస్తున్నా అందరికీ చేరడం లేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు. TRS ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ రక్తదానం
ఒడిశాలోని జాజ్‌పూర్‌కు చెందిన మహేష్ జెనా అనే 20 ఏళ్ల యువకుడు మహారాష్ట్రంలో పని చేస్తున్నాడు. నెలకు రూ.8000 జీతం. అయితే లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత జీతం డబ్బులు చేతికి అందలేదట. ఓవైపు చేతిలో చిల్లిగవ్వ లేదట. మరోవైపు ఆహారం దొరకడం గగనమైందని ఆవేదన చెందాడు. ఇకలాభం లేదనుకుని ఇంటికి సైకిల్‌పై వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తన స్నేహితుడికి కాల్ చేస్తే రూ.3000 అకౌంట్లో వేశాడని మహేష్ చెప్పాడు. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు
ఏప్రిల్ 1న మహారాష్ట్రలో ప్రయాణం మొదలుపెట్టగా 7వ తేదీన తమ స్వస్థలం జాజ్‌పూర్ సరిహద్దుకు చేరుకున్నాడు. తాను సైకిల్‌పై వేల కి.మీ దూరం నుంచి వస్తున్నానని చెబితే పోలీసులు జోక్ చేశానని నవ్వుకున్నారట. అయితే తాను రోజుకు 14 నుంచి 15 గంటలపాటు సైకిల్ తొక్కుకుంటూ వచ్చినట్లు వారికి వివరించాడు. దీంతో అంత సురక్షితం కాదని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఏపీలో ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్
తగిన ఆహారం లభించేది కాదని, రాత్రివేళ నిద్రించేందుకు గుడి పదిలమని భావిచి అక్కడే సేదతీరే వాడినని కార్మికుడు చెప్పుకొచ్చాడు. ఒడిశాకు వెళ్తుంటే మార్గం మధ్యలో హైదరాబాద్‌లో సైకిల్ పంక్చర్ అయ్యింది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డా. పలు ఏరియాల్లో చెక్ పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్నానని చెబితే అధికారులు, పోలీసులు నమ్మలేదని, జోక్ చేశానని భావించారని చెప్పాడు. క్వారంటైన్ గడువు ముగియడంతో ఇంటికి వెళ్తున్నట్లు వివరించాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!