వైసీసీ ఎంపీ కుటుంబంలో కరోనా కలకలం

దక్షణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దిగుమతి చేసుకున్న తర్వాత చేస్తున్న కోవిడ్19 టెస్టుల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Last Updated : Apr 26, 2020, 04:15 PM IST
వైసీసీ ఎంపీ కుటుంబంలో కరోనా కలకలం

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దక్షణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దిగుమతి చేసుకున్న తర్వాత చేస్తున్న కోవిడ్19 టెస్టుల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో 279 మంది కరోనా బారిన పడగా 9 మంది చనిపోయారు.  Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు

కరోనా బాధితులలో వైఎస్సార్ సీపీ నేత, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబసభ్యులు ఉండటం గమనార్హం. ఆయన కుటుంబంలో మొత్తం 6 మందికి కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. ఎంపీ సంజీవ్ కుమార్ ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, ఆయన తండ్రి (83)తో పాటు ఓ బాలుడు (14)కి తాజాగా నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ ఎంపీ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.  బ్రేకింగ్: ఏపీలో తాజాగా 81 కరోనా కేసులు

తన కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ తేలిందన్న వార్త నిజమేనన్నారు. తన తండ్రి కండిషన్ సీరియస్‌గా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. శరీరంలోని రోగ నిరోధక శక్తి వైరస్ బారి నుంచి కాపాడుతుందని, అయితే లాక్‌డౌన్ అంతగా ఉపయోగ పడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ కొనగసాగుతున్నా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఎంపీ సంజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News