India Covid: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, అయినా అప్రమత్తత అవసరమే..!
India Covid: దేశంలో కరోనా కేసులు ఒకరోజు పెరుగుతుంటే మరోరోజు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే 463 కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. అయినప్పటికీ అప్రమత్తత తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
India Covid: దేశంలో కొత్తగా 2841 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. నిన్నటితో పోల్చితే 463 కేసులు తక్కువ నమోదు కావడం కొంత ఊరటనిచ్చే అంశం. తొమ్మిది మంది మృతితో దేశంలో చనిపోయినవారి సంఖ్య 5 లక్షల 24 వేల 190కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18 వేల 604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3295 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 73 వేల 460కి చేరింది.
ఇక దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 31 లక్షల 16 వేల 254 మందికి కరోనా సోకింది. అటు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.04 గా నమోదైంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉండగా.. వారంతపు పాజిటివిటీ రేటు 0.69 శాతంగా రికార్డైంది. ఇప్పటివరకు 84 కోట్ల 29 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 4 లక్షల 86 వేల 628 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. అటు దేశంలో 190 కోట్ల 99 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
అమెరికాలో మొత్తంగా ఇప్పటివరకు 8 కోట్ల 23 లక్షల 25వేల 687 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. వైరస్ సోకి 9 లక్షల 99 వేల 128 మంది మృతి చెందారు. గడిచిన 28 రోజుల్లోనే అమెరికాలో 11 వేల 251 మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 520 మిలియన్లకు చేరుకుంది. మృతుల సంఖ్య కూడా 6.26 మిలియన్లను దాటింది. జాన్ హోపికిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. 11.39 బిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Also Read: Petrol Price Today: చమురు సంస్థలు కీలక ప్రకటన.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook