ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ వ్యాక్సిన్ కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ( 3rd Phase Trials ) మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford Vaccine ) వ్యాక్సిన్ తుది ట్రయల్స్ ను ఇండియాలో ఆగస్టు నెలలో జరపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కొనుగొనే రేసులో ముందున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి మరో కీలకమైన వార్త వెలువడింది. కోవిషీల్డ్ ( Covishield ) గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి, సరఫరా చేసే ఒప్పందం ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India ) జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford- Astrazeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైనట్టు కంపెనీ ప్రకటించింది. కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ఆగస్టులో ఇండియాలో ప్రారంభం కానున్నట్టు ఆక్స్ ఫర్డ్ తో ఒప్పందమైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 4 -5 వేల మంది వాలంటీర్లపై మూడవ దశ ట్రయల్స్ ను జరపనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. Also read: Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?


[[{"fid":"188365","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Covishield Vaccine 3rd phase trials","field_file_image_title_text[und][0][value]":"కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Covishield Vaccine 3rd phase trials","field_file_image_title_text[und][0][value]":"కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్"}},"link_text":false,"attributes":{"alt":"Covishield Vaccine 3rd phase trials","title":"కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ లో మెరుగైన టీ సెల్స్ రెస్పాన్స్ ( T Cell Response ) కన్పించిందని...దీనర్ధం వైరస్ ను దీర్ఘకాలం ఎదుర్కొనే సామర్ధ్యం వ్యాక్సిన్ కు ఉందని కంపెనీ తెలిపింది. అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగితే దాదాపు 3-4 వందల మిలియన్ డోసుల్ని డిసెంబర్ 2020 నాటికి ఉత్పత్తి చేస్తామని కంపెనీ సీఈవో అదార్ పూణావాలా ఇప్పటికే స్పష్టం చేశారు. ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకే కేటాయించనున్నట్టు కూడా కంపెనీ ప్రకటించి ఉంది. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే