Pak Drones Carry Explosives, Indian Ones Carry Medicines says Union Minister Jitendra Singh : పాక్ డ్రోన్‌లు పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్నాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister for Science and Technology Jitendra Singh) తెలిపారు. అయితే భారత డ్రోన్‌లు మాత్రం కోవిడ్‌ యోధుల్లా పని చేస్తున్నాయన్నారు. భారత డ్రోన్స్ మనుషుల ప్రాణాలను కాపాండేందుకు వ్యాక్సిన్లు, మెడిసిన్స్‌ను మోసుకెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ పాక్ డ్రోన్‌లు (Pak Drones) మాత్రం మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు చేస్తున్నాయన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్, భారత్ మధ్య ఉండే వ్యత్యాసం ఇదేనని మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌లతో పాటు అత్యవసర మందులను కూడా అత్యంత వేగంగా మన డ్రోన్‌లు తీసుకెళ్తున్నాయన్నారు.చాలా తక్కువ సమయంలోనే మెడిసిన్స్‌ను.. మందులు అందుబాటులో లేని ప్రాంతాలకు.. కష్టతరమైన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో మన డ్రోన్‌లు (Drones) ముందు వరుసలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మర్హ్ ప్రాంతంలో డ్రోన్ ద్వారా 50 దాకా కోవిడ్-19 వ్యాక్సిన్‌లను చేర్చిన సందర్భంగా.. మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read : Rave Party: కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ భగ్నం.. అంతా హోమో సెక్సువల్సే...!!


సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చొరవతో బెంగుళూరులో తయారు చేసిన ఆక్టాకాప్టర్ డ్రోన్స్ ఎన్నో సేవలను అందిస్తుందన్నారు.


Also Read : Eatala Rajender: ఆ అక్కసుతోనే కేసీఆర్ రైతులను వేధిస్తున్నాడు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook