pakistans conspiracy failed consignment of weapons dropped by drone recovered in jammu: పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్ (drone) భారత సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడించింది. ఒక ఏకే-47 (AK 47) తుపాకి, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, (bullets) ఒక టెలిస్కోప్‌ను (telescope) ప్యాక్‌ చేసి వదిలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో ఉన్న సౌజానా గ్రామంలో వీటిని గుర్తించారు. గట్టిగా శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూసిన ఓ స్థానికుడికి డ్రోన్ (drone) కనపడింది. అందులో నుంచి ఏదో వస్తువులను జారవిడుస్తున్నట్లు గుర్తించాడు ఆ స్థానికుడు. అయితే ఆ డ్రోన్‌ తిరిగి పాక్ వైపు వెళ్లినట్లు గుర్తించిన స్థానికుడు వెంటనే సమాచారాన్ని పోలీసులకు (police) అందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Deepika Padukone: దీపికా పదుకొనేకు గ్లోబల్‌ అవార్డు..తొలి ఇండియన్‌గా రికార్డ్


తర్వాత వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విషయాన్ని భద్రతా బలగాలు తెలిపారు. వారితో కలిసి రంగంలోకి దిగారు పోలీసులు. సౌజానా గ్రామాన్ని మొత్తం జల్లెడ పట్టారు. దీంతో వారికి పసుపు రంగులో ఉన్న ఓ ప్యాకెట్‌ దొరికింది. అందులో  ఏకే-47 తుపాకి, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఒక టెలిస్కోప్‌ బయటపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు (police) దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఈ ఆయుధాలను భారత్‌లో (India) ఎవరి కోసం పంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏడాది కాలంగా పాకిస్థాన్  (Pakistan) నుంచి మనదేశ భూభాగంలోకి డ్రోన్ సాయంతో ఆయుధాలు వస్తూనే ఉన్నాయి. పలుసార్లు పోలీసులు, భద్రతా బలగాలు వీటిని స్వాధీనం చేసుకున్నారు.


Also Read : Ys Sharmila Padayatra: తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర , రూట్‌మ్యాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి