Deepika Padukone: దీపికా పదుకొనేకు గ్లోబల్‌ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డ్

Deepika Padukone Global Achiever’s Award: దీపికా ఇప్పుడు మరో రికార్డ్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021 ని దక్కించుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 11:04 AM IST
  • పెళ్లి తర్వాత క్రేజీ ఆఫర్లతో కెరీర్‌‌లో దూసుకెళ్తున్న దీపిక
  • మరో రికార్డ్ సాధించిన బాలీవుడ్‌ భామ
  • ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021కు ఎంపికైన దీపిక
Deepika Padukone: దీపికా పదుకొనేకు గ్లోబల్‌ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డ్

Deepika Padukone wins Global Achiever’s Award for Best Actress: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) పెళ్లి తర్వాత కూడా కూడా క్రేజీ ఆఫర్లతో కెరీర్‌‌లో ముందుకెళ్తోంది. ‘రామ్‌లీలా’, (Ramleela) ‘బాజీరావ్‌ మస్తానీ’, `పద్మావత్` వంటి చిత్రాలతో అందరితో ప్రశంసలు పొందిన దీపికా ఇప్పుడు మరో రికార్డ్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు (Global Achiever’s Award) 2021 ని దక్కించుకుంది.

అయితే ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పోటీనే ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగానే నామినేషన్లు (nominations) వచ్చాయి. అందులో నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికాకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డుకు దీపిక అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, (Barack Obama) బిజినెస్‌మెన్‌ జెఫ్‌ బెజోస్‌, క్రీడాకారుడు క్రీస్టీనో రోనా​ల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఎంపికయ్యింది. 

Also Read : Ys Sharmila Padayatra: తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర , రూట్‌మ్యాప్

అయితే ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తి దీపికే (Deepika Padukone) కావడం విశేషం. ఇక దీపిక ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి ఫైటర్‌ మూవీలో నటిస్తోంది దీపిక. అలాగే అమితాబ్‌తో కలిసి ది ఇంటర్న్‌లో.. తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘83’ మూవీలో నటిస్తోంది దీపిక. అలాగే మరికొన్నిహాలీవుడ్‌ సినిమాల్లోనూ దీపిక నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంటోంది ఈ భామ.

Also Read : Pawan Kalyan Controversy: వివాదం రేపుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం : మంత్రి కన్నబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x