Pakistan: 12 ఉగ్రవాదసంస్థలకు ఆవాసంగా పాకిస్థాన్‌

Pakistan home to 12 groups designated: పాకిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాలపై టెర్రరిస్ట్‌ అండ్‌ అదర్‌ మిలిటెంట్‌ గ్రూప్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌  పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించింది. క్వాడ్ (Quad) సమ్మిట్ సందర్భంగా ఈ జాబితాను విడుదల చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 11:13 AM IST
  • 12 ఉగ్రవాదసంస్థలకు ఆవాసంగా పాకిస్థాన్‌
  • వెల్లడించిన సీఆర్‌ఎస్‌
  • కొన్ని ఉగ్రవాదసంస్థలు 1980ల నుంచి ఉన్నట్లు ప్రకటన
Pakistan: 12 ఉగ్రవాదసంస్థలకు ఆవాసంగా పాకిస్థాన్‌

Pakistan home to 12 groups designated as foreign terrorist organisations-CRS report : విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్‌టీవో)లుగా ముద్రపడిన 12 ఉగ్రవాదసంస్థలకు పాకిస్థాన్‌ ఆవాసంగా ఉందని అమెరికా కాంగ్రెస్‌కు (american congress) చెందిన స్వతంత్ర పరిశోధన విభాగం కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) (CRS )తెలిపింది. భారతదేశంలో, (India) అఫ్గానిస్థాన్‌లో (afghanistan) విధ్వంసమే లక్ష్యంగా ఈ 12 విదేశీ ఉగ్రవాద సంస్థలు పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఇందులో కొన్ని ఉగ్రవాదసంస్థలు 1980ల నుంచి ఉన్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాలపై టెర్రరిస్ట్‌ అండ్‌ అదర్‌ మిలిటెంట్‌ గ్రూప్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌ (Terrorist and Other Militant Groups in Pakistan) పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించింది. క్వాడ్ (Quad) సమ్మిట్ సందర్భంగా ఈ జాబితాను విడుదల చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది. 

భారత్‌ లక్ష్యంగా దాడులు చేసే లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు పాక్‌ పుట్టినిల్లు అని సీఆర్‌ఎస్‌ చెప్పుకొచ్చింది. పాక్‌ కేంద్రంగా లష్కరే తొయిబా (lashkare thoiba) 1980 నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే 2001లో దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. 2008లోని ముంబై దాడులు, ఇతర కీలక ఉగ్రదాడులు ఈ సంస్థ పనేనని సీఆర్‌ఎస్‌ తెలిపింది. 2000లో మసూద్‌ అజర్‌ ఏర్పాటు చేసిన జైషే మొహమ్మద్‌ సంస్థ మరుసటి ఏడాదే ఉగ్రవాద సంస్థగా వెలుగులోకి వచ్చింది. భారత పార్లమెంట్‌పై దాడితో పాటు అనేక దాడులకు ఈ సంస్థ పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే 1980లో పుట్టిన హరాకత్‌ ఉల్‌ జిహాద్‌ ఇస్లామీ (HARAKAT-UL JIHAD ISLAMI) మొదట తాలిబన్లకు సాయం చేస్తూ తర్వాత అఫ్గాన్‌, భారత్‌, బంగ్లాదేశ్‌ లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతోంది. కశ్మీర్‌లోనూ కల్లోలం సృష్టించేందుకు నిరంతరం దాడులు చేపడుతూనే ఉంది.

Also Read : Bank Holiday October 2021: వచ్చే నెలలో 21 రోజులు పాటు బ్యాంకులకు సెలవులు...బి అలర్ట్

అఫ్గాన్‌పై ప్రధానంగా దృష్టి

హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ మిలిటెంట్‌ గ్రూపుల కలయికతో పాక్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు (Terrorist activities) సాగిస్తున్న రాజకీయ అనుబంధ ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులకు పాల్పడుతోంది. అలాగే పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మరో సంస్థ అల్‌ఖైదా. కరాచీ, గిరిజన ప్రాంతాల్లో ప్రభావం కలిగి ఉన్న ఈ సంస్థ అఫ్గాన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని..

ఇలా అనేక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్‌ సురక్షితమైన కేంద్రంగా ఉందని సీఆర్‌ఎస్‌ వెల్లడించింది. అలాగే ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌, అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు సీఆర్‌ఎస్‌ (CRS) పేర్కొంది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, అకా జైష్‌ అల్‌ అద్‌, సిపాహీ సహ్‌బా పాకిస్థాన్‌, (Pakistan‌) లష్కరే జాంగ్వి వంటి సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read : Disha Encounter-Sajjanar: దిశ  హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News