Paytm app back on Google Play Store: పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించిందన్న వార్త శుక్రవారం అటు వాణిజ్య వర్గాల్లో ఇటు పేటీఎం యూజర్స్‌లో సంచలనం సృష్టించింది. ప్లే స్టోర్ సేఫ్టీ యూజర్ పాలసీకి విరుద్ధంగా ఉందన్న కారణంతో పేటీఎం మొబైల్ యాప్‌‌ని ( Paytm mobile app ) ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. Also read : Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేటీఎం యాప్‌ని ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ.. పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ ( Paytm money ), తదితర యాప్స్‌ని గూగుల్ అలాగే కొనసాగించింది. ఇదిలావుండగా తాజాగా మళ్లీ పేటీఎం యాప్ కూడా ప్లే స్టోర్‌లో తిరిగి అందుబాటులోకి వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పేటీఎం యాప్ నిర్వాహకులే ట్విటర్ ద్వారా తెలిపారు. Also read : TikTok: అమెరికాలో టిక్ టాక్ , వి చాట్ లపై నిషేధం, ఆదివారం నుంచి అమలు


Google play store నుంచి తమ యాప్ తొలగింపు వివాదంపై పేటీఎం సంస్థ స్పందిస్తూ.. గ్యాంబ్లింగ్‌పై ( Gambling ) పాలసీ నిబంధనలు అతిక్రమించిందనే నేరం కింద గూగుల్ తమ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు అంగీకరించింది. ఐతే పేటీఎం యూజర్స్‌కి ( Paytm users ) సంబంధించిన నగదు కానీ లేదా వారి ఖాతాల వివరాలు కానీ 100 శాతం భద్రత కలిగి ఉన్నాయని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పటివరకు పేటీఎం యాప్‌తో ఇతర యాప్స్‌పై ఎలాగైతే లావాదేవీలు జరిపారో... ఇకపై కూడా అలాగే జరుపుకోవచ్చని పేటీఎం స్పష్టంచేసింది. Also read : Vakeel Saab release date: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇదేనా ?


అంతకంటే ముందుగా పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లోంచి తొలగించిందనే వార్తలు వచ్చిన వెంటనే పేటీఎం యూజర్స్ అప్రమత్తమయ్యారు. అనేక లావాదేవీల్లో ( Paytm transactions ) పేటీఎం మొబైల్ యాప్‌ని విరివిగా ఉపయోగించే యూజర్స్‌లో ఒక రకమైన కలవరం మొదలైంది. 


చైనా యాప్స్‌లాగే ( China apps ) పేటీఎం యాప్ కూడా డేటా చౌర్యానికి పాల్పడుతోందా ఏంటా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఏదో ఓ బలమైన కారణం లేనిదే పేటీఎం యాప్ విషయంలో గూగుల్ ( Google ) ఈ నిర్ణయం తీసుకోదని కొంతమంది పేటీఎం యూజర్స్ ఓ నిర్ణయానికొచ్చేశారు. కానీ ఇంతలోనే కొన్ని గంటల వ్యవధిలోనే గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను అనుగుణంగా తమ యాప్‌ని తిరిగి గాడిలో పెట్టి యూజర్స్‌కి పేటీఎం భరోసా ఇచ్చింది. Also read : Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR