Vakeel Saab release date: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇదేనా ?

పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమా వకీల్ సాబ్ ఒక షెడ్యూల్ షూటింగ్ ( Vakeel saab movie shooting ) మాత్రమే మిగిలి ఉందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ మిగతా భాగాన్ని కూడా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు.

Last Updated : Sep 18, 2020, 08:19 PM IST
  • వకీల్ సాబ్ మూవీ విడుదల కోసం వేచిచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు
  • పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి వచ్చే సంక్రాంతి పండగ కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ?
  • వకీల్ సాబ్ మూవీ విడుదల తేదీ ఖరారైందా ?
Vakeel Saab release date: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇదేనా ?

Vakeel saab latest updates: పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమా వకీల్ సాబ్ ఒక షెడ్యూల్ షూటింగ్ ( Vakeel saab movie shooting ) మాత్రమే మిగిలి ఉందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ మిగతా భాగాన్ని కూడా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. దీంతో వకీల్ సాబ్ మూవీ విడుదల తేదీపైనే ( Vakeel saab movie release date ) ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. మరోవైపు మూవీ యూనిట్ సైతం దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. Also read : Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా

2021 జనవరి నాటికల్లా కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus crisis ) తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకుంటాయని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. అందుకే వచ్చే సంక్రాంతి ( Sankranti 2021 ) కానుకగా జనవరి 14న వకీల్ సాబ్ మూవీని విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే కానీ నిజమైతే.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి వచ్చే సంక్రాంతి పండగ మరింత స్పెషల్ కావడం ఖాయం. Also read : Nishabdham Movie: ఓటీటీలోనే స్వీటీ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ( Director Venu sreeram ) ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రారంభించనున్న లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో శృతి హాసన్ ( Actress Shruthi haasan ) సైతం జాయిన్ కానున్నట్టు సమాచారం. గతంలో గబ్బర్‌సింగ్, కాటమరాయుడు వంటి చిత్రాల్లో పవర్ స్టార్‌తో శృతిహాసన్ కలిసి నటించగా.. వకీల్ సాబ్ ( Shruthi haasan in vakeel saab ) వీళ్లిద్దరి కాంబోలో రానున్న మూడో చిత్రం అవుతుంది. Also read : Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News