Pm narendra modi oath ceremony 2024: దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడారంగం,దేశ, విదేశాల నుంచి అతిథులు భారీ ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్రపతిభవన్ లోజరిగిన మోదీ  ప్రమాణ స్వీకారోత్సవంలో దాదాపు.. పదివేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..  ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవం వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘనటలుజరగకుండా అధికారులు  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు.  డ్రోన్లు, పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ ఫోర్స్ అధికారులు, బ్లాక్ కమాండోలు, రాష్ట్రపతి భవన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదు కంపెనీల పారామిలిటరీ, ఢిల్లీ సాయుధ పోలీసుల జవాన్లలో వేలాదిగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గగనతల ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..


విదేశాల నుంచి వచ్చిన అతిథులు..


మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు , బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ ప్రచండ.. మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. వీరితో పాటుగా.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకార వేడుకలకు హజరయ్యారు. అంతేకాకుండా.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని టోబ్గే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


మన దేశంలోని ప్రముఖులు..


బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. వీరితో పాటుగా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. సైతం మోదీ ప్రమాణ స్వీకారోత్సంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా.. మోదీతో పాటు అనేక మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 


నరేంద్ర మోదీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌నాథ్ సింగ్ తర్వాత అమిత్ షా కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. ఎంపీగా పోటీ చేయకున్నా నిర్మలా సీతారామన్ మళ్లీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


సుబ్రహ్మణ్యం జై శంకర్,హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేశారు.జితిన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. సర్భానంద సోనోవాల్ వంటి వాళ్లంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ఉన్నారు.


Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..


ఇకతెలుగు స్టేట్స్ నుంచి కిషన్ రెడ్డి, కింజవరకు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ ఇంకా కొందరు ప్రముఖులు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో జనసేన అధినేత పవర్ కళ్యాణ్ తన సతీమణితో కలసి పాల్గొన్నారు. వేడుకలో ఆమె హల్ చల్ చేశారు. రాష్ట్రపతి భవన్ లో పవన్ తన సతీమణి అన్నా లేజీనోవాతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అందరిని ఆప్యాయంగా పలకరించారు. వీరిద్దరు వేడుకలో సందడి చేశారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter