New parliament: ప్రస్తుత పార్లమెంట్ భవనంపై మోదీ ప్రశంసలు
New Parliament: భారతదేశ నూతన పార్లమెంట్ కు భూమిపూజ పూర్తయింది. దేశ ప్రజలకు ఇదొక గర్వకారణమని..ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతమున్న భవనమైతే..ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని చెప్పారు.
New Parliament: భారతదేశ నూతన పార్లమెంట్ కు భూమిపూజ పూర్తయింది. దేశ ప్రజలకు ఇదొక గర్వకారణమని..ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతమున్న భవనమైతే..ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని చెప్పారు.
ఢిల్లీ సంసద్ మార్గ్ ( Delhi Sansad marg ) లో త్వరలో అన్ని వసతులతో కూడిన నూతన పార్లమెంట్ భవనం ( New Parliament Building ) రాబోతుంది. ఈ నూతన భవనానికి ప్రదాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) భూమి పూజ చేశారు. అనంతరం దేశప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడున్న పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయగా..నూతన పార్లమెంట్ భవనం దేశప్రజలకు గర్వ కారణంగా నిలుస్తుందని చెప్పారు. భారతీయలు ఆకాంక్షలకు కొత్త భవనం ప్రతీక అన్నారు. భూమి పూజ కార్యక్రమానికి ప్రధానితో పాటు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అంబేత్కర్ వంటి మహనీయులు సెంట్రల్ హాల్ లో రాజ్యాంగాన్ని రచించారని ప్రధాని మోదీ చెప్పారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాల్ని గ్రహించాలన్నారు.
కొత్తగా నిర్మించబోతున్న పార్లమెంట్ భవనం మొత్తం 64 వేల 5 వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాబోతుంది. కొత్త పార్లమెంట్ ( New parliament ) భవనంలో చాలా విశిష్టతలు చోటుచేసుకోనున్నాయి. మొత్తం 971 కోట్ల ఖర్చుతో భావి అవసరాలకు తగ్గట్టుగా 888 మంది లోక్ సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటుండేలా నిర్మిస్తున్నారు. 2022 ఆగస్టు 15 నాటికి కొత్త పార్లమెంట్ భవనం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుత భవనం స్వాతంత్య్రానంతరం దేశానికి దశ దిశ నిర్దేశించగా..కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్కు దిశానిర్దేశం చేయనుందని మోదీ తెలిపారు.
Also read: Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన