PM Modi Telangana Schedule:నేటిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్ల దాఖలకు ఈ రోజే చివరి తేది. దాంతో వివిధ పార్టీకి చెందిన పలువురు అభ్యర్ధులు నామినేషన్లకు దాఖలు చేయబోతున్నారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్‌గా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ ముందు హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాన మంత్రి .. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల 30, మే 3, 4వ తేదిల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.  ఈ నెల 30న ఆందోళ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఎన్నికల సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అదే రోజు ఈవెనింగ్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని శేరిలింగం పల్లిలోని ఐటీ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మే 3న వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజున నల్గోంగ, భువనగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. మే 4న నారాయణ పేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారని బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది.


 మే 13న జరగబోయే 96 లోక్ సభ సీట్లకు  4వ విడతలో భాగంగా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు  అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు. .ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. మొత్తంగా మే 13న  9 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శ్రీనగర్‌కు ఎన్నికలకు జరనుంది. తాజాగా ఆయా స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప  ఎన్నికల జరగనుంది.


Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook