Soumitra Chatterjee Passes Away: న్యూఢిల్లీ: ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెలలో సౌమిత్ర ఛటర్జీ (Soumitra Chatterjee Passes Away) కి కరోనావైరస్ పాజిటివ్‌గా (Coronavirus) నిర్థారణ అయిన తరువాత కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి మరింత దిగజారడంతో.. కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆసుపత్రిలో సౌమిత్ర ఛటర్జీ చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత ఆయనకు రెండు సార్లు ప్లాస్మా చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కరోనా నాడీవ్యవస్థ, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిందని.. 13వ తేదీ నుంచి ఆయన చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు ప్రకటించారు. Also read: COVID-19 Delhi updates: కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి


సౌమిత్ర ఛటర్జీ 1935 జనవరి 19న కోల్‌కతాలో జన్మించారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన ‘అపుర్‌ సంసార్‌' సినిమా (1959) తో కెరీర్‌ను ప్రారంభించారు. సౌమిత్ర మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్‌షా, పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమత పాల్గొని దిగ్గజ నటుడికి నివాళులర్పించారు. Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి