COVID-19 Delhi updates: కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి

ఢిల్లీలో గత 24 గంటల్లో 21,098 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3,235 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,85,406 కి చేరింది.

Last Updated : Nov 15, 2020, 07:16 PM IST
COVID-19 Delhi updates: కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి

న్యూఢిల్లీ : ఢిల్లీలో గత 24 గంటల్లో 21,098 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3,235 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,85,406 కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 95 మంది మృతి చెందారు. దీంతో నేటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,614కు పెరిగిందని ఢిల్లీ వైద్య శాఖ అధికారులు తెలిపారు. 

ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,37,801 కాగా పాజిటివిటీ రేటు 15.33శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 39,990 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న శనివారం ఢిల్లీలో 7,340 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ( COVID-19 ) తీసుకుంటున్న చర్యలపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind Kejriwal ) కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also read : Coronavirus on packaged meat: మాంసంతో కరోనావైరస్.. చైనాకు కొత్తగా మరో టెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News