Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి (Diwali 2020) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దీపావళి సందడే కనిపిస్తోంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi greets people on Diwali న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి (Diwali 2020) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దీపావళి సందడే కనిపిస్తోంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ జీవితాల్లో మరింత ప్రకాశవంతంగా వెలుగునివ్వాలని ఆకాంక్షించారు. అందరూ ఆయురారోగ్యాలతో.. ఉన్నతంగా ఉండాలంటూ.. మోదీ ట్విట్ చేశారు. ప్రధానితోపాటు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల జరిగిన తన రేడియో కార్యక్రమం 'మన్ కి బాత్' (Mann ki Baat) లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపి.. మన దేశాన్ని రక్షించే సైనికులకు గౌరవంగా దీపాన్ని వెలిగించాలని కోరారు. దీపాలు వెలిగించి సైనికులకు సెల్యూట్ (salute to soldiers) చేయాలని దేశప్రజలకు సూచించారు. ఇదిలాఉంటే.. మోదీ ఎప్పటిలాగానే సరిహద్దు ప్రాంతంలో ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకునే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. Also read: Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?
Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?
Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe