Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతి హాసన్‌ జంటగా క్రాక్ (Krack movie) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తుండగా.. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Last Updated : Nov 14, 2020, 07:10 AM IST
Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?

Ravi Teja’s Krack movie item song lyrical video released: టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతి హాసన్‌ జంటగా క్రాక్ (Krack movie) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తుండగా.. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే క్రాక్ మూవీని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవలనే చిత్రయూనిట్ పేర్కొంది. క్రాక్ చిత్రం షూటింగ్ ఫైనల్ పార్ట్ మాత్రమే మిగిలిఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే దీపావ‌ళి ప‌ర్వ‌దినం సందర్భంగా రవితేజ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మూవీ మేకర్స్. అంద‌రికీ దీపావళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర బృందం 'భూమ్ బ‌ద్ద‌ల్' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ మాస్ బీట్ పాటను ర‌వితేజ వర్మ హీరోయిన్ అప్స‌ర రాణిపై చిత్రీకరించారు. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

ఈ పాట మాస్‌ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ర‌వితేజ (Ravi Teja) ఎప్పటిలాగానే మాస్ డాన్స్‌తో రానుండగా.. అప్స‌ర రాణి (apsara rani) హాట్ హాట్ అందాలతో క‌నులవిందు చేయనుందని అర్థమవుతోంది. ఈ పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి రచించగా.. థమన్ (S. Thaman) సంగీతాన్ని అందించారు. మాస్ బీట్స్‌కు త‌గ్గ‌ట్లు సింగ‌ర్స్‌ సింహా, మంగ్లీ ఈ పాట‌ను పాడారు. అయితే పాటకు జాని మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. 

రవితేజ క్రాక్ మూవీ

 

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

 

Trending News