Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి మన్ కీ బాత్(Mann ki Baat)కార్యక్రమంలో వివిధ అంశాలపై స్పందించే ప్రధాని మోదీ మరోసారి కీలక విషయాలు మాట్లాడారు. మహిళల ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2020 మధ్య పరిశీలిస్తే.. మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపైందని చెప్పారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్‌ వ్యవస్థను సైతం మహిళలే ముందుండి నడిపిస్తారని మోదీ అభిప్రాయపడ్డారు. సైన్యం, పోలీసు శాఖలు కేవలం పురుషులకే అనే పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని మోదీ వ్యాఖ్యానించారు.


2014లో దేశవ్యాప్తంగా 1 లక్షాల 5 వేలమంది మహిళా పోలీసులుంటే(Women Police)..2020 నాటికి ఆ సంఖ్య 2 లక్షల 15 వేలకు చేరిందని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గణాంకాలే వెల్లడిస్తున్నాయని మోదీ గుర్తు చేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు దళాల్లో మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో సైతం పని చేస్తున్నారని ప్రశంసించారు. ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్లాస్టిక్ వినియోగంపై స్పందించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం(Swachh Bharat program)కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని ప్రజల్ని కోరారు. దేశంలో వందకోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిందని..ఇప్పుడు మరింత ఉత్సాహం, వేగంతో ముందుకెళ్తున్నామని మోదీ(Pm Narendra Modi) తెలిపారు. 


Also read: India New Strategy: సరిహద్దు రక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక చీమ చిటుక్కుమన్నా సరే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి