న్యూఢిల్లీ: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుటకై ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 'స్వామిత్వ యోజన'(Swamitva yojana)పథకాన్ని ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ చాలా గ్రామాల్లో నిరంతరం గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవలకు కారణం సరైన ఆధారాలు లేకపోవడమే కారణమని ప్రధాని అన్నారు. ఇకపై అలాంటి వాటికి చోటుండదని, దేశంలోని ప్రతి గ్రామంలో భూమిని మ్యాపింగ్ చేయడం జరుగుతుందని అప్పుడు భూమి యజమానికి యాజమాన్యం యొక్క ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుందని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే


ఇంతకుముందు గ్రామంలోని భూమిపై బ్యాంకు రుణం అమలు పారదర్శకంగా జరగడం లేదని, ఈ పథకం అమలులోకి వస్తే ప్రజలు తమ ఆస్తిపై రుణాలు పొందే అవకాశం ఈ పథకం ముఖ్య ఉద్ద్యేష్యం అన్నారు. అంతేకాకుండా ఈ పథకం గ్రామాల సామాజిక జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని, వ్యవసాయం రుణాలతో ఉపాధిని ప్రారంభించడానికి సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటకతో సహా ఆరు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నామని, ఈ పథకం లాభ, నష్టాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 


 చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..!!


అదే క్రమంలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిలో అవినీతిని నిర్మూలించడానికి అభివృద్ధి ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ఇ-గ్రామ్ స్వరాజ్(e-Gram Swaraj) పోర్టల్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ యాప్, పోర్టల్ సహాయంతో గ్రామ స్థాయిలో అన్నీ రకాల సేవలు సులభతరంగా వినియోగించుకోవచ్చని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..