PM Narendra Modi releases Rs 75 coin on 7th anniversary of FAO: న్యూఢిల్లీ: ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (FAO) ‌కు నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎఫ్ఏఓ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 75 రూపాయాల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనిమిది పంట‌ల‌కు సంబంధించిన 17 ర‌కాల బ‌యోఫోర్టిఫైడ్ రకాలను కూడా జాతికి అంకితం చేశారు. అయితే ఎఫ్ఏఓ వార్షికోత్సవం రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ర‌ల్డ్ ఫుడ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ 75 రూపాయల (Rs 75 coin) స్మరక నాణెం ప్రజలకు అందుబాటులో ఉండదు. దీనిపై ఎఫ్ఏఓ సహి పోషణ్.. దేశ్ రోషణ్ అని దీనిపై హిందీలో ఉంది. Also read: Nobel Peace Prize 2020: వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి పురస్కారం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ (WFP) కు ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారం దక్కడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. అయితే ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మకమైంద‌ని మోదీ వివరించారు. అయితే బలహీన వర్గాల ప్రజలను, ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నిరంతరం పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. Also read: Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం


భారతదేశ వినతితో ఎఫ్ఏఓ ( Food and Agriculture Organisation ) 2016లో అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని.. 2023 సంవత్సరాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇయ‌ర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్ర‌క‌టించింద‌ని మోదీ గుర్తుచేశారు. ఆహార, వ్యవసాయ సంస్థతో భారతదేశ అనుబంధం సుదీర్ఘకాలం నుంచి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ సంస్థకు భార‌తదేశ మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.


 


  Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe