భోపాల్: మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అర్ధాంతరంగా రద్దు కానుందా? కమల్ నాథ్ కు కష్టాలు తప్పేలా లేవా? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్నాయి మధ్యప్రదేశ్ రాజకీయాలు. ఈ నేపథ్యంలో  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  కమల్ నాథ్  అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్ మొహంతి సీఎం నివాసానికి చేరుకున్నారు. కాగా దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించిన తరువాత, ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాత్రి 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమల్ నాథ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: మధ్య ప్రదేశ్ రాజకీయ సంక్షోభం: కాంగ్రెస్ నుండి మరో రాష్ట్రం 'చే'జారనుందా?


మరోవైపు కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రస్తుతం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ తన ఎమ్మెల్యేలను బల ప్రదర్శన కోసం భోపాల్‌కు రప్పించాలని భావిస్తోంది. కాగా రేపు సాయంత్రం సమావేశం జరిగే అవకాశం ఉందని, ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసన సభ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవచ్చని వర్గాలు తెలిపాయి.


Read Also: Indian Railway: తత్కాల్ టికెట్స్ త్వరగా బుక్ చేసుకునేందుకు టిప్స్


కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావాహుడు అజయ్ సింగ్ భోపాల్ లోని  కమల్ నాథ్ ఇంటికి  ఇప్పటికే చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం కమల్ నాథ్, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్, రాజ్యసభ ఎంపి వివేక్ తంఖాతో సహా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అత్యవసర సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. 


Read Also: ఫ్రీ PAN Card కావాలా.. ఆధార్ సాయంతో 10 నిమిషాల్లో మీ చేతికి!


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..