ఫ్రీ PAN Card కావాలా.. ఆధార్ సాయంతో 10 నిమిషాల్లో మీ చేతికి!

పన్ను కట్టాలన్నా, ఏదైనా వెరిఫికేషన్‌లో కేవైసీ పత్రం కావాలంటే పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అయితే ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డ్ ఇలా పొందండి.

Last Updated : Mar 9, 2020, 02:39 PM IST
ఫ్రీ PAN Card కావాలా.. ఆధార్ సాయంతో 10 నిమిషాల్లో మీ చేతికి!

పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ, కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేవైసీ కోసం తప్పనిసరి కావాల్సిన వాటిలో పాన్ కార్డ్ (PAN) ఒకటి. మీకు పాన్ కార్డు లేదా.. అయితే ఆదాయపు పన్నుశాఖ మీకోసం ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆధార్ కార్డ్ కలిగి ఉన్నవారైతే మరీ మంచిది. కేవలం 10 నిమిషాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఆన్‌లైన్‌లో పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు! 

గతంలో మాదిరిగా రెండు పేజీల పాన్ కార్డ్ అప్లికేషన్ నింపకుండానే ఇన్ స్టంట్ పాన్ కార్డు పొందవచ్చు. కేవలం ఆధార్ కార్డు మీద ఉన్న వివరాలు, మొబైల్ నెంబర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డుకు ఇంట్లో కూర్చునే దరఖాస్తు చేసుకోండి. ఆధార్ వివరాలు ఇచ్చాక మొబైల్‌కు వచ్చే ఓటీపీని సబ్మిట్ చేస్తే ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ రెడీ అవుతుంది. దాన్ని పీడీఎఫ్ క్రియేట్ చేసి ప్రింట్ తీసుకుంటే సరి. లేకపోతే కార్డు కావాలంటే రూ.50 చెల్లిస్తే ఈసేవా, మీసేవా కేంద్రాలలో మీకు కార్డు అందిస్తారు.

Also Read: 2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ ఇలా లింక్ చేసుకోండి 

ఇన్‌స్టంట్ పాన్ కార్డుకు ఇలా అప్లై చేసుకోవచ్చు

1) ఆదాయపు పన్నుశాఖ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.  ఇక్కడ క్లిక్ చేయండి

2) ఎడమ వైపు ఉండే Quick Links కు వెళ్లి ‘Instant Pan through Aadhar’ మీద క్లిక్ చేయాలి

3) Get New PAN మీద క్లిక్ చేయాలి.

4) ఆధార్ నెంబర్ టైప్ చేయాలి

5) ఓటీపీ జనరేట్ చేయడానికి క్యాప్చా కోడ్ నింపాలి.

6) ఆధార్ కార్డు కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

7) మొబైల్‌కు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి

8) ఈమెయిల్ సాయంతో  కూడా ఆధార్ వివరాలను వెరిఫై చేయవచ్చు

9) OTP సబ్మిట్ చేసిన తర్వాత, UIDAI (ఆధార్ సంస్థ), ఆదాయపు పన్నుశాఖ శాఖలు కేవైసీ వివరాలను పరస్పరం షేర్ చేసుకుంటాయి. దీంతో మీ  ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ రెడీ అవుతుంది.

మీ వివరాలు సరిగ్గా ఫిల్ చేస్తూ వెళ్తే కేవలం 10 నిమిషాల్లోనే ఇన్ స్టంట్ పాన్ కార్డు పొందవచ్చును.

బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా? 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News