Sidhu Moosewala: పంజాబ్‌లో దారుణం జరిగింది. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా దుండగులు హత్య చేశారు. మాన్సా జిల్లాలో ఆయనను తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలైయ్యాయి. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వీఐపీలకు భద్రత ఉపసంహరించిన మరసటి రోజే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాన్సా జిల్లా జవహర్‌కే గ్రామంలోని దేవాలయం సమీపంలో ఘటన జరిగింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జవహర్‌కే వైపు వెళ్తున్న సిద్ధూ మూసేవాలా వాహనంపై దుండగులు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పంజాబ్‌లో రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది.


ఘటన వెనుక కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బార్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు అతడు అంగీకరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. గత ఏడాది కాంగ్రెస్‌లో చేరిన సింగర్ సిద్ధూ..ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాన్సా నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. వివాదాస్పద సింగర్‌గా ఆయన ఎప్పుడు వార్తల్లో నిలిచేవారు. సిద్ధూ మూసేవాలా పాడిన బంబిహ బోలే, 47 పాట అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది.


తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి చిత్రాల్లోనూ కనిపించారు. కరోనా సమయంలో ఫైరింగ్ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించడంతో కేసు నమోదు అయ్యింది. సిద్ధూ హత్యపై కాంగ్రెస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన దూరం అవడం పార్టీకి తీరని లోటు అంటూ నేతలు సంతాపం తెలుపుతున్నారు.  సిద్ధూ కుటుంబసభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నారు.


Also read: The Ancient Mysteries Cruise : బర్ముడా ట్రయాంగిల్ క్రూజ్ మునిగితే పూర్తి రీఫండ్


Also read:TRS Strategy: సీఎం కేసీఆర్ వ్యూహాం మారిందా..ఎన్టీఆర్ రాగం కలిసి వస్తుందా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook