The Ancient Mysteries Cruise : బర్ముడా ట్రయాంగిల్ క్రూజ్ మునిగితే పూర్తి రీఫండ్

The Bermuda triangle Cruise : వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుండి బెర్ముడాకు నార్వేజియన్ ప్రైమా సంస్థ నిర్మించిన క్రూయిజ్‌లో అట్లాంటిక్ సముద్రానికి ప్రయాణం సాగించనున్నారు కొందరు. ఈ షిప్‌ ఒకవేళ తప్పిపోతే ఇందులో ప్రయాణించే వారికి పూర్తి సొమ్ము తిరిగిస్తామని సదరు సంస్థ.. హామీ ఇస్తోంది.

Written by - Sreedhar | Last Updated : May 29, 2022, 06:12 PM IST
  • ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు బెర్ముడా ట్రయాంగిల్
  • బెర్ముడా ట్రయాంగిల్ క్రూయిజ్ ప్రయాణానికి ఏర్పాట్లు
  • అక్కడ అదృశ్యమైతే డబ్బు వాపస్ అంటున్న ట్రావెల్ సంస్థ
The Ancient Mysteries Cruise : బర్ముడా ట్రయాంగిల్ క్రూజ్ మునిగితే పూర్తి రీఫండ్

The Bermuda triangle Cruise : మానవాళి కనిపెట్టలేని ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. ఈ వింత ప్రాంతానికి వెళ్లేందుకు క్రూయిజ్ ప్రయాణానికి ఏర్పాటు చేస్తోంది ఓ సంస్థ. ఈ షిప్‌ ఒకవేళ తప్పిపోతే ఇందులో ప్రయాణించే వారికి పూర్తి సొమ్ము తిరిగిస్తామని సదరు సంస్థ.. ప్రయాణికులకు హామీ ఇస్తోంది. ఈ విచిత్రమైన ఆఫర్‌తో ప్రయాణికులను టెంప్ట్ చేస్తోందని ఓ యూకే మీడియా కథనం వెల్లడించింది.

డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలువబడే ప్రఖ్యాత బెర్ముడా ట్రయాంగిల్ మానవాళికి ఓ మిస్టరీగా మిగిలిపోయింది. డజన్ల కొద్దీ ఓడలు, విమానాలు ఈ రహస్య ప్రాంతంలో అదృశ్యమయ్యాయి. ఈ అదృశ్యం వెనుక కారణం చాలా ఏళ్లు మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ప్రమాదాలకు కారణం అక్కడి వాతావరణం అని కొందరు, మానవ తప్పిదాల ఫలితంగానే అని కొందరు ఎవరికి తోసినట్టు వారు ఆపాదించారు. కొంత మంది శాస్త్రజ్ఞులు మాత్రం.. ఈ ఓడలు, విమానాల అదృశ్యానికి అతీంద్రియ శక్తులు కారణమని, గ్రహాంతర వాసులు కారణమని ఇలా రకరకాలుగా కారణాలు చెప్పారు.

ఈ క్రూయిజ్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్న ట్రావెల్ ఏజెన్సీ అయిన ఏన్షియంట్ మిస్టరీస్ క్రూయిస్ (the Ancient Mysteries Cruise) సంస్థ.. తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది.

 "ఈ బెర్ముడా ట్రయాంగిల్ టూర్‌లో అదృశ్యమౌతామని చింతించకండి. ఈ పర్యటనకు వెళ్లిన క్రూయిజ్‌తో సహా అంతా 100 శాతం తిరిగొస్తారు. ఒక వేళ తప్పిదారి తిరిగి రాకున్నా.. డబ్బు తిరిగి ఇస్తాం. తిరిగి రాకుండా మిస్ అయ్యే ఛాన్సే లేదు"
-ట్రావెల్ ఏజెన్సీ

ప్రయాణీకులు వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుండి బెర్ముడాకు నార్వేజియన్ ప్రైమా సంస్థ నిర్మించిన క్రూయిజ్‌లో అట్లాంటిక్ సముద్రానికి ప్రయాణం సాగించనున్నారు. అతిథులు గ్లాస్-బాటమ్ బోట్‌లో ఈ ప్రత్యేకమైన ట్విలైట్ బెర్ముడా ట్రయాంగిల్ క్రూయిజ్‌ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని ట్రావెల్ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఈ అసాధారణ ఆఫర్ ద్వారా ప్రయాణీకులు షిప్‌లో క్యాబిన్ కోసం సుమారు 1,450 యూరోలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది.

Also Read - Nayanthara wedding: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి కార్డు ఇదేనా? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Also Read - Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x