Modi America Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటించనున్నారు. క్వాడ్ దేశాల నేతల తొలి ముఖాముఖి భేటీకు హాజరుకానున్నారు. ఇదే నెలలో పర్యటన జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ నెలలో క్వాడ్ దేశాల (Quad Countries)నేతల ముఖాముఖి సమావేశం జరగనుంది. ఈ భేటీ ఎప్పుడు ఎక్కడ జరిగేది ఇంకా కొలిక్కి రాకపోయినా ఇదే నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఈ పర్యటన నిమిత్తం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా(Pm Narendra modi) పర్యటించనున్నారు. క్వాడ్ దేశాల నేతల ముఖాముఖి భేటీ ఎక్కడనేది తెలిసిన వెంటనే ప్రధాని మోదీ పర్యటన ఖరారు కానుంది. ఈ నెల 22-27 మధ్య జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీను ఉద్దేశించి ప్రసంగం, క్వాడ్ సమావేశాల్లో పాల్గొనడం, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో(Joe Biden) సమావేశం ఉంటాయి.


వాస్తవానికి ఈ సమావేశం గురించి ఇప్పటికే నిర్ధిష్ట ప్రకటన రావల్సి ఉంది. అయితే పదవి నుంచి దిగిపోతానంటూ జపాన్ ప్రధాని సుగా చేసిన వ్యాఖ్యలతో సందిగ్దంలో పడింది. క్వాడ్ సమావేశంతో పాటు త్వరలో జరగాల్సిన ఇండో-జపాన్ సమావేశం కూడా ఖరారు కాలేదు. ఇప్పటికే రెండేళ్లుగా ఈ భేటీ వాయిదా పడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన(Pm Modi America Tour) ఖరారైతే చేయాల్సిన ఏర్పాట్లపై ఇండో అమెరికా అధికారులు చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పే ఉద్దేశ్యంతో క్వాడ్ ఏర్పాటైంది. 


Also read: Nipah Virus: కేరళలో మరో కలకలం, నిఫా వైరస్ కారణంగా బాలుడి మృతి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook