భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Pm narendra modi assets value ) ఆస్థి ఎంతో తెలుసా ? గత యేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. తన మొత్తం ఆస్థిని స్వయంగా మోదీ ప్రకటించారు. ప్రధాని కార్యాలయానికి సమర్పించిన ఆ నివేదిక ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రతి యేటా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేబినెట్ మంత్రులందరూ తమ తమ ఆస్థి వివరాల్ని ( Modi declares his assets value ) ప్రకటిస్తున్నారు. ఈ వివరాలన్నీ స్వయంగా ప్రదానమంత్రి కార్యాలయానికి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రధాని మోదీ ఆస్థి విలువ స్వల్పంగా పెరిగింది.  2020 జూన్‌ 30 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా 2 కోట్ల 85 లక్షలట. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా వెల్లడించారు.


ప్రధానమంత్రి కార్యాలయానికి ( PMO ) సమర్పించిన నివేదిక ప్రకారం ఆయన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్‌ నెల ముగిసేనాటికి ప్రధాని మోదీ వద్ద  31 వేల 450 రూపాయల నగదు ఉండగా.. ఎస్బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సీ శాఖలోని ఆయన ఖాతాలో 3 లక్షల 38 వేల 173 రూపాయలు ఉన్నాయి. ఇక అదే బ్రాంచ్‌లో ఒక ఎఫ్‌డీఆర్‌ కూడా ఉంది. మల్టీ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో 1 కోటి 60 లక్షల 28 వేల 939 రూపాయలున్నాయని మోదీ వెల్లడించారు.


గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌ ( Gandhinagar ) సెక్టార్‌-1లో తనకు ఓ ప్లాట్‌ ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 3 వేల 531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్థలంపై ముగ్గురికి సమాన హక్కు ఉందని, ఒక్కొక్కరికి 25 శాతం వాటా ఉందని తెలిపారు. మరోవైపు దాదాపు 18 ఏళ్ల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన ఈ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆ ప్లాట్ విలువ 1.3 లక్షల రూపాయలు కాగా...ఇప్పుడు  మార్కెట్‌ విలువ ప్రకారం, ప్రధాని మోదీ స్థిరాస్తి విలువ  కోటి పది లక్షలుందని అంచనా.


ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్  ( National savings certificates ) విలువ 8 లక్షల 43 వేల 124 అని మోదీ తెలిపారు. ఇవి కాకుండా జీవిత బీమా పాలసీ విలువ 1 లక్ష 50 వేల 597 అని చెప్పారు. ఇక చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. అయితే ఏ బ్యాంకులోనూ ప్రధాని మోదీకు రుణాలు లేవు. అటు ఆయనకు సొంత వాహనం కూడా లేదు. ఇక ఆభరణాల విషాయనికొస్తే...ప్రధాని మోదీకు దాదాపు 45 గ్రాముల 4 బంగారు ఉంగరాలున్నాయి. ప్రతియేటా స్వయంగా ఆస్థుల్ని వెల్లడిస్తూ మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారు. Also read: Kerala Gold scam: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కేసుకు సంబంధం