Flash floods: ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదపై స్పందించిన ప్రధాని మోదీ, కొనసాగుతున్న సహాయక చర్యలు
Flash floods: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు తలెత్తాయి. భారీ మంచు చరియలు విరిగిపడటంతో నదీమట్టం భారీగా పెరిగింది. విద్యుత్ కేంద్రంలో నీరు చేరడంతో 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.
Flash floods: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు తలెత్తాయి. భారీ మంచు చరియలు విరిగిపడటంతో నదీమట్టం భారీగా పెరిగింది. విద్యుత్ కేంద్రంలో నీరు చేరడంతో 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.
ఉత్తరాఖండ్ ( Uttarakhand ) లో ధౌలిగంగా నది ( Dahuliganga river ) ఆకస్మాత్తుగా ఉప్పొంగిపోయింది. అనూహ్యంగా భారీ వరద వచ్చి పడింది. భారీగా మంచు చరియలు ( Glacier ) విరిగి పడటంతో నీటిమట్టం భారీగా పెరిగిపోయింది. దాంతో చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరిపోయింది. భారీ వరద ప్రవాహానికి ఆనకట్టు కొట్టుకుపోయింది. వరద నీరు ప్రవేశించడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు ( Rushiganga power project ) లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో విద్యుత్ కేంద్రానికి చెందిన 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఈ ఘటనను ధైర్యంతో ఎదుర్కొంటాని ఆకాంక్షించారు. ఎప్పటికప్పుడు ఈ ఘటనపై తనకు అప్‌డేట్ వస్తోందని చెప్పారు.
తక్షణం ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీసులు సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లోతట్టుప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధౌలీగంగా నదీ తీరానికి వెళ్లవద్దని స్థానికులు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశముండటంతో..ధౌళిగంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. సంఘటనా ప్రాంతానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ( Uttarakhand cm Trivendra singh rawat )చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook