PM Narendra Modi: నరేంద్ర మోదీ గురువు కన్నుమూత.. ట్విట్టర్‌లో ప్రధాని ఎమోషనల్
PM Modi School Teacher Passed Away: ప్రధాని నరేంద్ర మోదీ స్కూలు టీచర్ రాస్బిహారీ మనియార్ కన్నుమూశారు. ఆయన మరణవార్త పట్ల మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన టీచర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు.
PM Modi School Teacher Passed Away: ప్రధాని నరేంద్ర మోదీకి విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాల ఉపాధ్యాయుడు రాస్‌బిహారీ మనియార్ కన్నుమూశారు. స్వయంగా అతనితో ఫోటో, వీడియోను మోదీ ట్వీట్ చేశారు. తన స్కూల్ టీచర్ మృతికి సంతాపం తెలుపుతూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ రాశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో రాస్‌బిహారీ మనియార్ కీలక పాత్ర పోషించారని, ఆయన మరణవార్త విని బాధపడ్డానని ప్రధాని మోదీ అన్నారు.
ఆయన గుజరాతీలో ట్వీట్ చేస్తూ.. 'మా స్కూల్ టీచర్ రాస్బిహారీ మనియార్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. నా జీవితంలో ఆయన అమూల్యమైన సహకారం అందించారు. జీవితంలో ఈ దశ వరకు నేను అతనితో అనుబంధం కలిగి ఉన్నాను' అని రాసుకొచ్చారు. విద్యార్థిగా తన జీవితాంతం ఆయన మార్గదర్శకత్వంలో ఉన్నందుకు తనకు సంతృప్తి ఉందన్నారు.
తన గురువుతో కలిసి దిగిన ఫొటోను ప్రధాని మోదీ షేర్ చేశారు. ఈ ఫొటో కొన్ని సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి తన గురువును సన్మానిస్తున్నప్పుడు తీసినది. ఇందులో ప్రధానమంత్రి తన గురువుకు నమస్కరిస్తున్నారు. గురువు పాదాలను తాకి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. వీడియోను చూస్తుంటే.. వీరిద్దరి మధ్య గురు-శిష్యుల మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది.
మోదీ చాలాసార్లు పాఠశాలలోని ఉపాధ్యాయులను ఉద్దేశించి.. వారి గొప్పతనం గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తుంటారు. గుజరాత్ సీఎం హోదాలో అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన తన ఉపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా ఎప్పుడు గుజరాత్‌కు వెళ్లినా.. కాస్త సమయం దొరికితే గురువులను కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..? ఒక్కపోస్ట్‌తో అభిమానుల్లో ఆందోళన
Also Read: Sanju Samson: సౌత్ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook