Modi speaks: దేశంలో కరోనా ఉధృతి తారాస్థాయికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ నలుగురు ఎవరు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.మూడు రోజుల్నించి ఏకంగా 4 లక్షల పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4 లక్షల 14 వేల కొత్త కేసులు వెలుగు చూశాయి. కరోనా ఉధృతి నేపధ్యంలో ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రధాని మోదీ (Prime minister Narendra modi)..తాజాగా నలుగురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. 


రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ( Uddhav Thackeray), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, హిమాచల్ ప్రదేశ్ జైరాం ఠాకూర్‌లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందోనని ప్రదాని మోదీ అడిగారు. కోవిడ్ 19 కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆక్సిజన్ కొరత లేకుండా సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. అదే విధంగా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న విధానం గురించి ప్రధాని మోదీకు వివరించారు. కోవిడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విలువైన సూచనలివ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల్ని మన్నిస్తున్న ప్రధాని మోదీకు ధన్యవాదాలు తెలిపారు థాకరే. 


Also read: Covid Medicine: కోవిడ్‌కు మందు వచ్చేసింది..అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook