Priyanka Gandhi Vadra: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ( ఏఐసీసీ) అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా  నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ వేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా  గెలిచారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు చోట్ల గెలిస్తే.. ఏదైనా ఒక సీటను రెండు వారాల్లో ఒదులకోవాలి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ.. వయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వయనాడ్ లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రియాంక  నామినేషన్‌కు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అయిన రేవంత్ రెడ్డి,  సిద్దరామయ్య, సుఖ్ విందర్ తో పాటు  పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు, పీసీసీ అధ్యక్షలు  పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు.


అంతకంటే ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్‌ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్డు షో నిర్వహిస్తారు.మరోవైపు నామినేషన్ లో పాల్గొనేందుకు ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డితో పాటు  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వయనాడ్ వెళ్లారు.


మరోవైపు ప్రియాంక వాద్రా వాయనాడ్ నుంచి గెలవడం ఈజీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ప్రియాంక వాద్రా గెలిచి పార్లమెంటులో లెగ్ పెడితే.. ఒకే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిస్తే.. అన్నా చెల్లెల్లుగా రికార్డు క్రియేట్ చేయనున్నారు.  


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇక కేరళలోని 20 లోక్ సభ స్థానాల్లో అందరు పురుషులే గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసి ఒకవేళ విజయం సాధిస్తే.. కేరళ నుంచి తొలి మహిళ ఎంపీగా రికార్డు  క్రియేట్ చేయనున్నారు.  అంతేకాదు అక్కడ ప్రియాంక వాద్రా.. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యతను కాంగ్రెస్ శ్రేణులు భుజాలపై తీసుకున్నారు.  2019 ఎన్నికల నుంచి పొలిటికల్ గా యాక్టివ్ గా  ఉన్న ప్రియాంక.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. వాయనాడ్ నుంచి ఫస్ట్ టైమ్ ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరి ఈ పోటీలో ప్రియాంక వాద్రా గెలవడం నల్లేరు పై నడక అంటున్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter