Priyanka Gandhi Vadra: గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగారు. దాంతో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి బరిలో దిగి రెండు చోట్ల ఎంపీగా విజయం సాధించారు.  దీంతో కేరళలోని వయనాడ్ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు.  ఆయన రాజీనామా చేసిన ఎంపీ సీటుకు తాజాగా ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాందీ వాద్రా బరిలో దిగింది. తాజాగా ఈ ఎన్నికల్లో అందరు ఊహించనట్టుగానే కౌంటింగ్ లో ముందుంజలో ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినా.. ప్రియాంక గాంధీకి ఓ వర్గం ఓట్లు గంపగుత్త పడ్డట్టు స్పష్టమైంది. 64.72% ఓటింగ్ జరిగింది. రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తరుపు నవ్య హరిదాస్ పోటీ చేసారు. మరోవైపు లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ నుంచి సత్యమ్ మోకోరి బరిలో నిలిచారు.


2009 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వాయనాడ్ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా  6 వేలకు పైగా మెజారిటీతో లీడింగ్ ఉన్నారు. రెండో స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ..మూడో స్థానంలో బీజేపీ నేత ఉన్నారు. దాదాపు ప్రియాంక .. ఈ స్థానం నుంచి గెలవడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒకే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అన్నా చెల్లెల్లుగా రాహుల్ గాంధీ, ప్రియాంక రికార్డు క్రియేట్ చేసారు.  


ఇక కేరళలోని 20 లోక్ సభ స్థానాల్లో అందరు పురుషుల అభ్యర్ధులే  పార్లమెంటులో ఉన్నారు.  ప్రియాంక గాంధీ వాద్రా తొలి మహిళ ఎంపీగా ఆ రాష్ట్రం నుంచి రికార్డు క్రియేట్ చేయబోతుంది. 2019 ఎన్నికల నుంచి క్రియాశీల రాజకీయాల్లో  యాక్టివ్ గా ఉన్న ప్రియాంక గాంధీ.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాయనాడ్ నుంచి తొలిసారి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల గోదాలో దిగి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter