Pulwama attack: పుల్వామా దాడిపై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Pakistan`s Federal Minister Fawad Choudhry about Pulwama attack: న్యూ ఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ( Pakistan terrorists ) జరిపిన ఈ ఆత్మాహుతి దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఐతే ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ( Pakistan ) ఇప్పటివరకు వాదిస్తూ వస్తోంది.
Pakistan's Federal Minister Fawad Choudhry about Pulwama attack: న్యూ ఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ( Pakistan terrorists ) జరిపిన ఈ ఆత్మాహుతి దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఐతే ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ( Pakisthan ) ఇప్పటివరకు వాదిస్తూ వస్తోంది. పుల్వామా దాడికి కుట్ర జరిగింది పాకిస్తాన్‌లోనే అయినప్పటికీ... తమకు ఈ ఉగ్రదాడితో సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. కానీ తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ( Pak PM Imran Khan ) ఆ దేశం సాధించిన విజయాల గురించి మంత్రి ఫవద్ చౌదరి మాట్లాడుతూ.. పుల్వామా ఎటాక్‌ని సైతం ఇమ్రాన్ ఖాన్ విజయంగానే అభివర్ణించారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో భారత్‌లోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు జరిపినట్టు ఫవద్ చౌదరి వ్యాఖ్యానించారు. Also read : Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి
పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలే పుల్వామా ఉగ్ర దాడి ( Pulwama Attack ) వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఇప్పటివరకు పుల్వామా దాడితో సంబంధం లేదని ఐక్యరాజ్య సమితి ఎదుట ( UNO ) నాటకం ఆడుతూ వచ్చిన పాకిస్తాన్.. ఇకపై భారత్‌కి ఏం సమాధానం చెబుతుందో, ఫవద్ చౌదరి వ్యాఖ్యలపై ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి. Also read : Central Home Ministry: 18 మంది టెర్రరిస్టుల కొత్త జాబితా