Central Home Ministry: 18 మంది టెర్రరిస్టుల కొత్త జాబితా

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం పట్టు బిగించింది. ఓ వైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా తీవ్రవాదుల్ని మట్టుబెడుతూనే..నిఘాను మరింతగా పెంచింది. కొత్తగా 18 మందిని తీవ్రవాదులుగా ప్రకటించింది.

Last Updated : Oct 27, 2020, 06:32 PM IST
Central Home Ministry: 18 మంది టెర్రరిస్టుల కొత్త జాబితా

ఉగ్రవాదం ( Terrorism ) పై కేంద్ర ప్రభుత్వం ( Central Government ) పట్టు బిగించింది. ఓ వైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా తీవ్రవాదుల్ని మట్టుబెడుతూనే..నిఘాను మరింతగా పెంచింది. కొత్తగా 18 మందిని తీవ్రవాదులు ( list of 18 new terrorists ) గా ప్రకటించింది.

పుల్వామా దాడి ( pulwama attack ) జరిగినప్పటి నుంచి టెర్రరిజంపై పోరు తీవ్రం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు నిఘా పెంచుతూనే మరోవైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా పెద్దఎత్తున టెర్రరిస్టుల్ని మట్టుబెడుతోంది. ఇందులో భాగంగానే చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల ర‌క్ష‌ణ చ‌ట్టం 1967 కింద కొత్త‌గా 18 మందిని ఉగ్ర‌వాదులుగా ప్ర‌క‌టించింది. జాతీయ భ‌ద్ర‌త ( National Security ) ‌ను బ‌లోపేతం చేయ‌డంలో, అవలంభిస్తున్న జీరో టాల‌రెన్స్ ( Zero Tolerance ) విధానంలో భాగంగా మోదీ స‌ర్కార్ 18 మంది వ్య‌క్తుల‌ను ఉగ్ర‌వాదులుగా గుర్తించిన‌ట్లు  కేంద్ర హోంశాఖ ( Central Home ministry ) తెలిపింది. యూఏపీఏ చ‌ట్టంలోని నాలుగ‌వ షెడ్యూల్‌లో ఉగ్ర‌వాదుల‌ పేర్ల‌ను చేర్చింది.

కేంద్ర హోంశాఖ ప్రకటించిన 18 మంది తీవ్రవాదుల పేర్లు

సాజిద్ మీర్‌, యూసుఫ్ ముజ‌మ్మిల్‌, అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కి, షాహిద్ మెహ‌మూద్‌, ఫ‌ర్హ‌తుల్లా ఘోరీ, అబ్దుల్ రవూఫ్ అస్గ‌ర్‌, ఇబ్ర‌హీం అత్త‌ర్‌, యూసుఫ్ అజ‌హ‌ర్‌, షాహిద్ ల‌తిఫ్, స‌య్యిద్ మొహ‌మ్మ‌ద్ యూసుఫ్ షా, గులామ్ న‌బీ ఖాన్‌, జాఫ‌ర్ హుస్సేన్ భ‌ట్‌, రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, షేక్ ష‌కీల్‌, మ‌హ్మ‌ద్ అనిస్ షేక్‌, ఇబ్ర‌హీమ్ మీన‌న్‌, జావెద్ చిక్నాలు కొత్తగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు.  దేశ స‌రిహ‌ద్దుల్లో  ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.

Trending News