Pune porsche crash case 2 doctors arrested: పూణే పోర్షేకారు ఘటనలో సినిమా రేంజ్ లో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మైనర్ బాలుడు తప్పతాగి, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా.. ఈ ఘటనలో మైనర్ ను పోలీసులు అరెస్టు చేసిన 15 గంటల్లోనే బెయిల్ రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే మైనర్ బాలుడి తండ్రిని, తాతను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరు కూడా ఘటనను,  వారి డ్రైవర్ తమ మీద వేసుకొవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..


ఇక మైనర్ బాలుడి తాత.. ఏకంగా డ్రైవర్ ను ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేసి, డబ్బుల ఆశచూపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ భార్యఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, తాతను, తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇక  మరోవైపు పోలీసులు మైనర్ బాలుడి బ్లడ్ సాంపుల్స్ లను టెస్టుల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చారు. ఇక్కడ కూడా మైనర్ బాలుడి తండ్రి, తాత డాక్టర్లను ప్రభావితంచేసినట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలుడికి సాంపుల్స్ లను బైట పడేసి, అతని బ్లడ్ లో ఆల్కాహల్ లేదని రిపోర్టు ఇచ్చారు. 


పోలీసులకు అనుమానం రావడంతో మరో ఆస్పత్రిలో సాంపుల్ లను టెస్టుల కోసం ఇచ్చారు. అప్పుడు ఆ రిపోర్టులో మరో విధంగా రిజల్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో... పోలీసులు సాసూన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యులు అజేయ్‌ తావ్‌రే, శ్రీహరి హార్నూర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కానీ, విచారణలో మాత్రంమైనర్ బాలుడు మద్యం సేవించినట్టు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా స్నేహితులతో కలిసి అతడు మద్యం తాగినట్లు రికార్డు అయ్యింది. దీంతో వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు ధ్రువీకరించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యులు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలించారు.


ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచి నిందితుడి తండ్రి.. వారితో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించామని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఈ ఘటనలో మైనర్ బాలుడికి ఫెవర్ చేసేలా ప్రవర్తించారని కోందరు పోలీసులు సస్పెండ్ కు గురైన విషయం తెలిసిందే.


Read more: Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం.. 


మరోవైపు ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అశ్విని కోస్టా, అనీశ్ లను అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మైనర్ బాలుడు ప్రాణాలు పోయేలా చేశాడు.  ఈ కేసులో బాలుడికి జువైనల్‌ జస్టిస్ట్ బోర్డు కొద్ది గంటల్లో బెయిల్‌ ఇవ్వడం,  ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించి తీర్పు నివ్వడంను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter