Sidhu controversy: పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు నవజోత్​ సింగ్ సిద్ధూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో (Sidhu Controversy) పడ్డారు. ఈ సారి పోలీసుల గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా (Sidhu Controversial comments on Police) దుమారం రేపాయి. దీనితో పంజాబ్​లో పోలీసులు వర్సెస్ సిద్ధూ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ సిద్ధూ ఏమన్నారంటే..


రెండు వేర్వేరు కార్యక్రమాల్లో సిద్ధూ పోలీసుల గురించి ఉపయోగించిన పదజాలం వివాదానికి తెర తీసింది. పంజాబ్​లోని సుల్తాన్​పూర్​లో లోధిలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి సిద్ధూ హాజరయ్యారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాపై ఈ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. అయితే ఈ క్రమంలో.. 'ఎమ్మేల్యే తన అధికారంతో పోలీసుల ప్యాంట్లు తడిచేలా చేయగలరు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు (Sidhu Police wet pants remark) చేశారు. దీనితో పాటు బటాలాలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్​ చల్ చేస్తున్నాయి. దీనితో సిద్ధూ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పరువు నష్టం దావా..


ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్​ పోలీసులు సిద్ధూపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఓ బాధ్యతగల నాయకుడు అందులోనూ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పోలీసులు పేర్కొన్నారు. అందరికీ రక్షణ కల్పించే పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే లేకపోతే.. రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని విమర్శించారు. ఈ కారణంగానే ఆయనపై పరువు నష్టం దావా వేసినట్లు చండీగడ్​ డీఎస్పీ దిల్షేర్ సింగ్ తెలిపారు. ఈ మేరకు సిద్ధూకు నోటీసులు కూడా పంపినట్లు వెల్లడించారు.


రాజకీయంగా విమర్శలు..


సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులతో పాటు.. పంజాబ్​ బీజేపీ, శిరోమణి అకాలీదళ్​ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని పంజాబ్​ బీజేపీ ట్విట్టర్​ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది



అందరికీ రక్షణ కల్పించే పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ శిరోమణి అకాలీదళ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధూ పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్​ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.


Also read: Missionaries of Charity: మదర్ థెరిసా సంస్థల బ్యాంకు ఖాతాలు సీజ్ అయ్యాయా లేదా..అసలేం జరిగింది


Also read: Congress party 137th foundation day: సోనియా గాంధీకి చేదు అనుభవం.. అటు పార్టీ జెండా పడిపాయే.. పాలనలోనూ పడిపాయే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook